ఈ పుటను అచ్చుదిద్దలేదు

గా. ణు

డా। మధురాంతకం నరేంద్ర 9866243659

రచన - ప్రతిరచన

శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖవాళ్ళు యిటీవల కేంద్రసాహిత్య అకాడమీ సంయుక్త నిర్వహణలో “తెలుగు సాహిత్యంలో రచన-ప్రతిరచని అనే అంశంపైన వొక సదస్సును నిర్వహించారు. యామధ్య కాలంలో వరసగా కేంద్రసాహిత్య అకాడమీ యీప్రాంతాల్లో వుండే సాహిత్యసంస్థలతో కలిసి కొన్ని ఆసక్తికరమైన అంశాలపైన, యింతవరకూ యెవరూ పట్టించుకోని కొన్ని ముఖ్యమైన విషయాలపైన నిర్వహిస్తున్న సదస్సుల్లో యిదిగూడా వొకటి. ౦6వానదన్సుకు రావలసిన ఇద్దరు వ(త్రనముర్భకులు రాలేకపోవడంతో ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు నేనా సదస్సులో పాల్గొనవలసివచ్చింది. అప్పుడు *“రచన-వ్రతిరచని అనే అంశంగురించి చాలా ఆసక్తికరమైన విషయాలు నాకు స్ఫురించాయి.

సామాజిక జీవితానికి వుపనదిలా ప్రవహించే సాహిత్యసృృజనలో కాలానుగుణంగా వచ్చే మార్చులూ, చేర్చులూ ప్రతిఫలిస్తూనే వుంటాయి. సంప్రదాయమూ, కాల్చనికతా వొకదానికొకటి ప్రతిస్పందనలా వచ్చిపోతూనే వుంటాయి. మానవీయమైన విలువల్లో కూడా యిటువంటి పెద్ద మార్పులూ జరుగుతాయి. కొన్ని సంవత్సరాలక్రితం అప్పటి విలువల్ని ప్రతిపాదిస్తూ వచ్చిన రచనల్ని యిప్పటి రోజుల్లో చదివినప్పుడు వాటివల్ల నిరసనా, వ్యతిరేకతా కలగడంతో ఆశ్చర్యంలేదు. అటువంటి సందర్భాల్లో రచయితలు అదే రచనకు వ్యతిరేకంగా ఆధునిక రచనల్ని రాస్తారు. వాటినే 'ప్రతిరచనలు అని సదస్సు నిర్వాహకులు పేరుపెట్టారు.

'నవలి అనే ప్రక్రియకున్న లక్షణాల్ని చర్చిస్తూ “ఆస్పెక్ట్‌స్‌ ఆఫ్‌ ద నావలొ అనే ప్రసిద్ధమైన పుస్తకాన్ని రాసిన యి.యం. ఫాస్టర్‌ అంటాడు. 'పారడీ అంటే వ్యంగ్యంగా అనుసరించడం అని అర్ధం. “పారడీ* అంటే కేవలం అపహాస్యంచేసే పాటలూ, రచనలుగా మాత్రమే భావించే తెలుగువాళ్ళకు 'పారడీ” పైన అంతగా గౌరవముండదు. కానీ పాశ్చాత్య సాహిత్యంలో *పారడీ చాలా ముఖ్యమైన రచనగా గుర్తించబడుతోంది.

పాశ్చాత్య నవలకంతా ప్రారంభంగా గుర్తించే సెర్వాంటిస్‌ రచన “దాన్‌ క్విగ్జోటొ గూడా అప్పుడు ప్రాచుర్యంలో ఉందే రొమాన్సులకు పారడీగానే రూపొందింది. రొమాన్సుల్లోని కథానాయకులు అతిమానవ శక్తులతో, అసాధారణమైన వీరకృత్యాలతో, వొళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేసేవాళ్ళు. ఆ రచనల్లోని అవాస్తవికతను యెగతాళి చేయడంకోసం సెర్వాంటెస్‌ డాన్‌క్పిగ్టోట్‌ అనే యాఖైఏళ్ళ వ్యక్తిని కథానాయకుడుగా తీసుకున్నాడు. రొమాన్సుల్లోని కథానాయకుల్లాగే శాసించాలని ప్రయత్నంచే, దాన్‌కి, గోట్‌ సాహసాలు చివరకు హాస్యాన్నిమాత్రమే కలిగిస్తాయి. 17వ శతాబ్దపు ప్రారంభంలో వచ్చిన యీ రచన ప్రపంచ సాహిత్యంపైన గాధమైన ప్రభావాన్ని కలిగించి, నవలా ప్రక్రియ రూపకల్పనలో ప్రముఖ పాత్రను పోషించింది.

'పారడీ” కున్న ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి యింగ్లీషు నవలాచరిత్ర ప్రారంభం యింకా బాగా వుపయోగపడుతుంది. అప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న 'నవలు అనే 'పెద్ద కథను ముందుగా వాడినవారు శామ్యూల్‌ రిచర్డ్‌సన్‌ అనే ఇంగ్లీషు పత్రికారచయిత. ముందుగా ఆనాడు పాఠకులకు యిష్టమైన లేఖల్ని రాయదమెలాగో చెప్పడంకోసం ఆయన వొక లేఖల పుస్తకం ప్రచురించాడు. అందులో కొందరు వూహించబడిన పాత్రలు, వూహాత్మకమైన సందర్భాల్లో యితరులకు ఉత్తరాలు రాస్తారు. అలా రాస్తున్నప్పుడు రిచర్డ్‌సన్‌ చాలాకాలం క్రితం తాను వార్తాపత్రికల్లో చదివిన ఒక వృత్తాంతం ఆధారంగా ఒక ఉత్తరం రాశాడు. తరువాత ఆ వృతాంతాన్నే లేఖారూపరచనగా నవలను రాశాడు. అందులో పామెలా అనే అందమైన బీద అమ్మాయి మిస్టర్‌బీ అనే ధనవంతుడి ఇంటిలో పనిమనిషిగా చేరుతుంది. ఆమెను ఎలాగైనా వశపరచుకోవాలని యజమాని అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆమె అన్నీ తప్పించుకుంటుంది. చివరకు ఆమె మంచి శీలాన్ని గుర్తించిన ఆ యజమాని ఆమెకు పెద్ద బహుమానం యిస్తాడు. ఆమెను అతడు పెళ్లాడడమే ఆ బహుమానం. ఆ నవల పేరు పామెలా. దాని వుపళీర్షిక “వర్యూ రివార్డిదొ అని. అంటే 'సచ్చీలతకు బహుమానరి అని అర్ధం.

కేవలం ఒక రచనను నిరసించి, వ్యతిరేకించినంతమాత్రాన మరో గొప్పరచన పుట్టదు. మరో రచన భూమికలోంచీ పుట్టినప్పటికీ యేరచనయితే తనదైన స్వయంప్రతిపత్తిని సాధించుకుంటుందో అది మాత్రమే

సాహిత్యంలో మనగలుగుతుంది. సాహితీ యాత్రలో రచనలూ, ప్రతిరచనలూ యెప్పుడూ వస్తూనే వుంటాయి. తెలుగు సాహిత్యంలోనూ యీధోరణీ తొలినుంచి యిప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. అయితే

గోల్టింగ్‌ చెప్పిన ఆ సత్యాన్ని గుర్తించి, పాటించిన రచనలే చివరకు గొప్ప రచనలుగా మిగులుతాయి.

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |