ఈ పుటను అచ్చుదిద్దలేదు

2. మత్తు పానీయాలు స్వీకరించడం. 3. నల్లనీ వస్త్రధారణ 4. పోర్చుగీను సైనికులు/ పటాలం వాళ్ళు భారతీయ స్త్రీలను బలవంతంగా వివాహం చేసుకోవడం. 5. అప్పటి [క్రైస్తవులుగా మారిన వారు దేశీయులతో స్వతంత్రంగా లేకపోవడం పూర్వ ఆచారాలకు పండగలకు దూరం కావడం. 6.పరవర్‌లు అనే మత్యృకారులు అంటరానీవారంబనందువల్ల వారితో యధేచ్చగా కలవలేక దూరం కావడం 7. కైస్తవుల మత ఆచారాలు పండుగలు పద్దతుల్లో దేశీయులు పాల్గొన్నందువల్ల పూర్వ పురోహిత వర్గం వీరిని వెలివేయడం. మొదలయిన కారణాలవల్ల ఆనాటికి కైస్తవ్యం వృద్దిచెందలేదు. ఈ పరిస్థితిలో నోబీలి తన ఆచారాలు, సంప్రదాయం అన్నీ మార్చుకో వాలనే నిర్ణయానికి వచ్చాడు. అప్పటివరకూ ఉన్న నల్లనీ వస్త్రధారణ తీసివేసి కాషాయవస్త్రాలు, ఆదివారం ఆరాధనలో తెల్లనీ వస్త్రాలు ధరించడం, కాళ్లకున్న బూట్ల స్థానంలో పావుకోళ్లు, వెండి పోగులతో తయారుచేసిన జంధ్యం దానికి వెండితో చేసిన సిలువ, నుదుట గంధపు తిలకం, చేత కమండలం ధరించి బయటికి రావడం, వగలు శాకాహారం, రాత్రికి ఒకగ్గాసు ఆవుపాలు మాత్రమే స్వీకరించేవాడు. తనకు ప్రత్యేక వంటవాళ్లను కేవలం బ్రాహ్మణులను మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. ప్రతి ఉదయం తెల్లవారురూముననే నమీవంలోనీ నదికి వెళ్ళి స్నానం చేసేవాడు. మపొళలతో మాట్లాడేవాడు కాదు. పగలు ధ్యానంలో గడిపేవాడు. తెలుగు, తమిళ భాషలను బాగా అధ్యయనం చేశాడు. ఆనాటికి సంస్కృత అధ్యయనం అందరూ చేయకూడదనే నియమం ఉండేది. అందునా పాశ్చాత్యులు అసలు చదవకూడదని ఒకవేళ చదివినా నాలుక చెవులు తెగకాయ్యాలని, చెవుల్లో సీసం కరిగించి పోయ్యాలని, నేర్చిన వాడి నాలుక తెగకోసి గ్రామబహిష్మరణ చేయాలనే నియమాలు ఉందేవి. అందువల్ల నోబిలి సంస్కృతం రాత్రిపూట నేర్చుకునేవాడు. తన గురువు చాలాబిన్నగా చెవిలో విన్సీంచేటట్లు గుసగుసలాదేవాడు. ఆ విధంగా సంన్కృతం నేర్చుకున్నానని నోబిలి తన లేఖల్లో రాసుకున్నాడు. 22-4-1609 నాటి లేఖలో “*నాగురువు మంచి పండితుడు. ఆయన నాకోసం శాస్త్రములన్నిటిని వ్రాసిపెట్టెను. ఇది రహస్యముగనే జరగవలెను. ఆవిషయము గనుక ఇతర బ్రాహ్మణులకు తెలిసినచో వారు ఆయన కనుగుర్లను పెరికివైచెదరు. ఇదియే అతి తక్కువ శిక్షూ అనీ చెప్పాడు. పాశ్చాత్యులలో సంస్కృతం నేర్చిన

వారిలో నోబిలి ప్రధముడు. ఆయన సంస్కృతం చదవడం రాయడం నేర్చిన తర్వాత చతుర్వే దాలను (ఫెంచ్‌ భాషలోకి అనువాదం చేశాడు. పాశ్చాత్యులకు మన వేదాలను తొలిగా పరిచయం చేసిన వాడు నోబిలి. నోబిలి సమయం దొరికినపుడెల్లా సంస్కృత పండితులతో చర్చించేవాడు. ఈయన పద్దతులు, ఆచారాలు, ఆహార నియమాలు ఇతర జెస్వూట్‌ ఫాదర్లకు భిన్నంగా ఉన్నందువల్ల 'జగద్దురు తత్త్వ జోధకస్వామి” అనీ పిలిచేవారు. నోబిలి పద్దతులు ప్రజలకు సహితం నచ్చాయి. ఆయన దర్శనంకోసం ఉదయం ఏటికి స్నానానికి వెళ్ళే సమయంలో గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఆయన నడిచిన అనంతరం పాదధూళినీ సయితం తలపై జల్లుకునే స్థాయికి వచ్చిం దంటే ఆయనలోని మార్చు, ఆయన సమాజంలో తెచ్చిన మార్పు కనీపిస్తుంది. ఆయన ఆచారాలవల్ల అనంతరకాలంకాని నేడుకాని కైస్తవ మత గురువుల వస్త్రధారణలో తెల్లనీ వస్త్రాలు అంగీలుగా ధరించడం నోబీలితోనే మొదలయింది. ప్రపంచ వ్యాప్తంగా తెల్లని అంగీలు ధరించడానికి కారకుడు నోబిలి. అదీ భారతదేశంలో ప్రారంభించడం విశేషంగా పేర్ళానవచ్చు. నోవీలి బహుభాషాపండితుడు, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, సంస్కృతం, తెలుగు తమిళం అనర్గళంగావచ్చు. తమిళంలో కూదా కొన్ని [గ్రంధాలు రచించాడు: 1. జ్ఞాన లక్షణ 2. జ్జాన విళక్మం 3. సత్యనాయవిలక్కం 4 అనంద జీవం. వివాహాది షోడశ సంస్కారాలు ఆచరించే పద్దతులు గలమరో స్తకం రచించాడు. తెలుగులో కూడా 1. జ్ఞాన సంక్షేపము. 2. నర్జన్మ ఆక్షేపము ౩.విశ్వాస సల్లాపము అనే ప్ప క పుస్తకాలు రచించాడని దాక్టర్‌ జె.మంగమ్మగారు బుక్‌ ప్రింటింగ్‌ ఇన్‌ ఇండియా (1978) అనే పుస్తకంలో వివరించారు. సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో విశిష్టమైన కృషిచేసిన తొలిపాశ్చాత్య సంస్కృత పండిచుడయిన రాబర్ట్‌ డి.నోబిలి 16-2- 1656లో మద్రాసులో పరమపదించాడు. నోబిలి సాహిత్యకృషి, మజ పరమైన దేశీయ విధివిధానాలకు అనుగుణంగా మార్చి ప్రజల అభిమానాన్ని గౌరవాన్ని పొందిన నోబిలి కృషి చిరన్మరణీయం. ఆయన స్మృత్యర్థం మదురైలో నోబిలి కళాశాల, నోబిలి అంతర్జాతీయ పరిశోధనాసంస్థ, నోబిలి విద్యావికాసకేంద్రం లాంటి సంస్థలు నేటికీ

ఉన్నాయి.

ని

.

“భాషా పెత్తనం స్వరాజ్యం కాబోదు మయొదటి (ప్రాధాన్యత ఎల్లవేళలా మాతృభాషదే ఆ తర్వాతనే హిందీ భాష

నిఖార్సయిన ఉన్నతి మాతృభాషతోనే సాధ్యం” “మాతృభాషను పణంగా పెట్టి ఆంగ్రభాషను నేర్చుకోవలసివస్తే

అసలు ఆంగ్లభాషను నేర్చుకోవలసిన అవసరం ఏ


| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

దేశానికీ లేదు” వై మహాత్మాగాంధీ