ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రాంగనూరు (ప్రాంతంలో ఉందే పరవర్హు అనబదే జాలరులను అంటరానీవారుగా పరిగణించేవారు. పరవర్లకు ఇతర కులాలవారికీ సంబంధ బాంధవ్యాలు లేవు. కాని పరవర్లు సముద్రపు వేటలోనూ, సముద్రతీర ప్రాంతంలోనూ అన్ని విధాల నైపుణ్యంగల కష్టజీవులు. వీరికి చేపల వేటతోపాటు వ్యవసాయం కూడా తెలుసు. అందువల్ల కనాయిమోమా వీళ్ళను మనుషులుగా గుర్తించి వారి నైపుణ్యాన్ని గౌరవించి వారితో వియ్యమంది నవర్డులుగా తీర్చిదిద్దాడు. ఈ ప్రాంతంలో పరవర్లుతో సిరియా నుంచి వచ్చిన వందల కుటుంబాలు మమేకమై వర్తక వాణిజ్య వ్యాపారాలు నీర్వహించడమే కాకుండా ఉత్తమ స్థాయి శ్రేణిగల జీవితానికి మార్చుచెందినట్టు ఆనాటి లేఖలవల్ల తెలుస్తుంది. ఈ సమయంలోనే సిరియన్‌, మలయాళీ భాషల అధ్యయనం జరిగింది. వారికి పాఠశాలలు (ప్రారభించి విద్యా వ్యాప్తికి బీజం పడినట్టు తెలుస్తుంది. నామమాత్రపు పాఠశాలలేగాని, అవి పూర్తికాలపు పాఠశాలలుగా రూపొందిన ఆధారాలు లేవు. పాశ్చాత్య దేశాలతో వర్తక వాణిజ్యం భారతదేశంతో కొనసాగు తున్నందువల్ల సుగంధద్రవ్యాలు విరివిగా మన దేశంలో అఖిస్తున్నందు వల్ల విదేశీయులు ఇక్కడ స్థిరపడటం జరిగింది. పూర్తిగా స్థిరనివాసం ఏర్పాటుకానీ పరిస్థితుల్లో కూడా వారి అవాస ప్రాంతాలు, వాణిజ్య కూడళ్ళలో మతపరమైన ప్రార్ధనలు నిర్వహించే గురువులు బోధకులు

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

కావలసిన పరిస్టితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోర్చుగల్‌ దేశపు రాజు మూడవ జాన్‌(1521-57) భారతదేశానికి మతగురువులను పంపే ఏర్పాటుచేశాడు. అదే సమయానికి (1540) సొసైటీ ఆఫ్‌ జీసస్‌ అనే సంస్థ స్థాపన జరిగింది. ఈ సంస్థకు ఆద్యుడు ఇఅగ్నేషియస్‌ లయోల అనే ఉపాధ్యాయుడు. ఇతరు పారిస్‌ విశ్వవిద్యాలయంలో 1510లో పట్టభద్రుడైన అనంతరం అదే విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడయ్యాడు. విద్యార్థి దశలోనే ఇగ్నేషియస్‌ లయోలాకు పీటర్‌ ఫ్రేవి, ఫ్రాన్సిస్‌ జేవియర్‌, డియాగో లెయిన్స్‌, ఆల్ఫోన్సెస్‌, నికొలస్‌ బాబతిల్లా, సైమన్‌ రోడ్రిగస్‌ అనే ఆరుగురు స్నేహితులు కలిసి సమాజ సేవ చేయాలని అన్నార్తులను, దీనార్తులను అభాగ్యులను ఆదరించి, ఆశ్రయం కలిగించాలని నిర్ణయించుకున్నాను. అలాగే వారి జీవిత ఆశయాలను సఫలం చేయాలంటే అవివాహితులుగా ఉందాలని దీనకి తోడు క్రీస్తు అనుచరులుగా జీవించాలని అనుకున్నారు. అదే విషయాన్ని ఒక నిబంధనావళి తయారుచేసి 1539లో జగద్దురువైన పోపుకు సమర్పించారు. 1540 సెప్టెంబర్‌ 27న సొసైటీ ఆఫ్‌ జీసస్‌ అనే పేంతో సంస్థను రిజిస్టరు చేసి ప్రారంభించారు. ఈ సంస్థ పోప్‌ ప్రత్యక్ష పాలనలో నడుస్తుంది. ఈ సంస్థ పక్షాన 1542 మే 6న ఫ్రాన్సిస్‌ జేవియర్‌ గోవా వచ్చాడు. అప్పటికే గోవాలో బుడతకీచు రాజ ప్రతినిధి ఆల్బూకర్క్‌ నేతృత్వంలో జేవియర్‌కి కావలసిన ఏర్పాట్టు గావించాడు. ఐదు నెలల్లో తమిళ భాషాధ్యయనం చేసి తమిళంలోనే మాట్లాడుతూ తిరువాన్నూరు రాజ్యం అయిన మళ్వాలో పాఠశాలలు ప్రారంభించాడు. అనంతరం ఆయన వైనా, శ్రీలంక, జపాన్‌ తదితర దేశాలు పర్యటించి అక్కడా పాఠశాలలు నెలకొల్పాడు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి గోవాలో సెయింట్‌ పాల్ఫ్స్‌ కళాశాల 1544లో ప్రారంభించాడు. ఇక్కదే పోర్చుగీసు, తమిళంలో నిరంతరం బోధన జరిగింది. తెలుగు వాళ్లు కూదా కొద్దిగా ఆప్రాంతంలో ఉన్నందువల్ల వారికీ తెలుగు పాఠశాల ఏర్పాటుచేసినట్టు ఇంపీరియల్‌ జిటీర్‌ ఆఫ్‌ ఇండియా 1వ వాల్యూమ్‌ పుట442లో ఉంది. అనంతరం అనారోగ్యం కారణంగా 1552 డిశంబరు 3న పరమపదించాడు. ఐతే ఆయన పార్టివదేహం నేటి వరకు గోవా దేవాలయంలో పదిలంగా ఉంది.

17వ శతా్టీ పారంభం క్రైస్తవ మత సామాజిక వ్యవస్థలో నూతనాధ్యాయం ఏర్పడిందని చెప్పవచ్చు. దీనికి ఆద్యుడు, ఆచార్యుడు రాబర్ట్‌ డి.నోవీలి (౧౦091 09 స0010). నోవిలి ఇటలీవాని. మాంటిపుళ్చియానో అనే గ్రామంలో 1577లో జన్మించాడు. పదేళ్ళకే (గ్రీకు, లాటిన్‌ ధారాణంగా మాట్లాదేవాడు. మాతృభాష అయిన ఇటాలియన్‌ లో పదేళ్ళకే కవితలు చెప్పేవాడు. కళాశాల విద్యానంనతరం జెస్యూట్‌ ఫాదర్‌ల సంఘంలో చేరి శిక్షణ పొంది చర్చిఫాదర్‌ అయ్యాడు. వారి సంస్థ ఆదేశంమేర జెస్యూట్‌ ఫాదర్‌ల వ్రతినిధిగా 1606లో తమిళనాడులోని మధురకు వచ్చాడు. అతితక్కువ కాలంలోనే తమిళం నేర్చుకున్నాడు. ధారాళంగా తమి ళంలో మాట్టాడుతున్నా తనవద్దకుగాని, తన సంస్థలోని ఫాదర్‌ వద్దకు గానీ తమిళులు రావడానికి గానీ మాట్లాడటానికి గాని యిష్టపదేవారు కాదు. దీనికి కారణాలు అన్వేషించాడు. అన్య దేశీయుల ఆచారాలకు వీళ్ల ఆచారాలకు చాలా తేదాలు చూశాడు. ముఖ్యంగా ఫావర్లు 1. పశుమాంస భక్షకులు