ఈ పుటను అచ్చుదిద్దలేదు

11355]



జా కి |







ఉన్న వాళ్లందరూ పైకి వెళ్లిపోయినట్టున్నారు. మేం ఇద్దరమే మిగిలాం. వెలుగు రేకులు పరుచుకుంటున్నాయి. తను స్ఫష్టంగా కన్పిస్తోంది. ప్యాంటూ షర్టూ వేసుకుంది, బ్యాక్‌ ప్యాక్‌ చాలా బరువుగా ఉంది, ఆ బ్యాగ్లో ఏమున్నాయో... బెంగాల్‌ నుంచి ఇండోనేషియా ఒకత్తే ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు.

“అలా చూడండి... ఇక మూడు అంతస్థులే ఉన్నాయి... మనం దాదాపు పైకి వచ్చేశాం” అంది.

“సుమారు వంద అడుగుల ఎత్తున్న స్థూపం ఇది. తొమ్మిది అంతస్థులుగా తీర్చిచెళ్కారు. దిగువన ఆరు అంతస్థులు చతురస్రా కారంలో, పై మూడు అంతస్థులు వృత్తాకారంలో నిర్మించారు. ఈ మూడు వరుసల్లో 72 బౌద్ధ శిల్పాలను చెక్కారు. ఇవన్నీ ధ్యానముద్రలో ఉండడం విశేషం. విగ్రహాల చుట్టూ స్ట్థూపాక్ళత కవచం ఆకట్టు కుంటుంది. ఆ కవచానికి ఉన్న రంధ్రాల మధ్యలోంచి మనం లోపలి విగ్రహాల్ని చూడొచ్చు. దీన్ని నిర్మించడానికి 75 ఏళ్ళు పట్టిందట. బౌద్ద పౌర్ణమి నాడు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఎక్కడెక్కడి నుంచో బౌద్దగురువులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేక అతిధిగా ఈ దేశ ప్రధానీ ఆ వేడుకలకు హాజరవడం విశేషం. ఇండోనేషియా ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిమ్‌ దేశమైనా వౌద్ద పూర్ణిమ ఇక్కడ జాతీయ సెలవు...” తను వివరిస్తోంది.

“రెండు వందల ఏళ్ల క్రితం వరకూ ఈ నిర్మాణం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అగ్నిపర్వత బూడిదలో ఈ ప్రాంతం అంతా కప్పబడి పోయింది. (బటిష్‌ గవర్నర్‌ జనరల్‌ సర్‌ థామస్‌ స్టామ్‌ ఫర్డ్‌ రఫెల్స్‌ వల్లే ఈ స్టూపం వెలుగులోకి వచ్చింది. ఆధునిక

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |





సింగపూర్‌ రూపకర్త గా ఆయన 'పేరుతెచ్చుకున్నారు. ఆ తరవాత ఎన్నో సార్లు భూకంపాలకు, అగ్నిపర్వత దాడులకు లోనైంది. అనేక పర్యాయాలు దీన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ రూపంలో ఉంది? అంటూ దూరంగా ఉన్న పర్వతాలను చూస్తూ ఆగింది.

దట్టమైన పర్వతాలు... పొగమంచు వీడుతోంది. ఆ పర్వతాల మధ్యలోంచి వస్తోన్న సూర్యుడు... ఆ వెలుగులో ఈ బుద్ద వి[గ్రహాలన్నీ బంగారు కాంతితో మెరుస్తున్నాయి. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ తను అక్కదే కట్టమీద కూర్చుండిపోయింది. తన పసిడి వన్నెను సూర్యోదయ కాంతి వేయి రెట్లు పెంచుతోంది. తన మొఖం సంతోషంతో వెలిగిపోతోంది. పసిపాపలోని వెన్నెల కాంతి తనలో కన్పీస్తోంది.

“ఓసారి ఇటు రా.. అంటూ చొరవగా పిలిచింది. నా ఆలోచనల్ని పక్కనపెట్టి వెళ్లాను. మెట్లుదిగి కింది నుంచి రా అంది.

మెట్లవైపు వెళ్లాను. చాలా మందే ఉన్నారు. సూర్యోదయాన్ని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. విదేశీయులే ఎక్కువ. పన్నెండు మెట్లు దిగి ఆమె ఎదురుగా వెళ్లి నీల్చున్నాను. రెండు చేతులూ అందించింది. పట్టుకున్నాను... తను కిందికి దిగుతుందేమోనని దగ్గరగా వెళ్లాను. ఒక్కసారిగా నా నుదిటిన ముద్దుపెట్టి... తన తలను దూరంగా జరిపింది. చేతులు మాత్రం పట్టుకునే ఉంది. ఇద్టరి మధ్యలోంచి సూర్యకిరణాలు వెళుతున్నాయి. ఆ క్షణాన్ని ఎవరైనా ఫొటో తీస్తే బాగుందేదనీ అన్పించింది. అలాగే స్థానువుగా ఉంది పోయా తన కళ్లనే చూస్తూ తనూ అలాగే చూస్తోంది. ఓ క్షణం కాగానే చేతుల్ని వదిలేసింది. సూర్యోదయాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. కై