ఈ పుటను అచ్చుదిద్దలేదు

డి.పి. అనూరాధ 9010016555




సోదావరి నుంబి జానా


దొకా..






(జదిగిన కథ)

తెలుగు తల్లి కృపతో సూర్యవర్శ్మ కాలాలకు అతీతంగా ప్రయాణాలు చేస్తుంటాడు. మయన్మార్‌, థాయిలాండ్‌ లలో తెలుగు మూలాలున్న జాతీయుల్ని కలుసుకుంటాడు. కాంబోడియాలోని ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఆంగ్‌ కార్‌ వాట్‌ ఆలయానికి

తెలుగు నేలతో ఉన్న అనుబంధం గురించి జెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆగ్నేయాసియాలో పేరుగాంచిన అలనాటి చంపా రాజ్య వైభవాన్ని కళ్ళారా చూస్తాడు. వియత్నాంలోని నేటి అఆ రాజ్య శిథిలాల మధ్య నడుస్తూ ఉద్వేగానికి గురవుతాడు. అతడి తదుపరి మణిలీ ఎక్కడ?...

చిమ్మచీకటి.. ఏదో కొండ ఎక్కుతున్నా.. అన్నీ రాతి మెట్లే... నా ముందు

కొంత మంది నడుస్తున్నారు... నా వెనకా కొంత మంది.. అందరి చేతుల్లో టార్చ్‌ లైట్లు... వాటి వెలుగులో ఒక్కో మెట్టూ నెమ్మదిగా ఎక్కుతున్నాం.. అటూ ఇటూ ఏవో మాటలు విన్పీస్తున్నాయి కానీ, ఆ భాషేమిటో సృష్టంగా అర్థం కావల్లేదు. నాకు కాస్త ముందు వెళ్తోన్న వ్యక్తి జారిపడిపోతూ “అమ్మా.” అనీ అరుస్తూ అక్కడే కూర్చిండిపోయింది. దగ్గరగా వెళ్లి చూస్తే పాతికేళ్ల లోపు యువతి.

“మీరు తెలుగా,,” అని అడిగా..

“మీరూ తెలుగు వారేనా...” ఎదురు ప్రశ్నించింది తలూపుతూ...

శాలు బెణికిందా...”అనీ ప్రశ్నించా.

“అంతగా కాదు. కానీ నొప్పిగా ఉంది.

“మీది ఏ ఊరు”? అడిగా..

“మాది పశ్చిమజెంగాల్లోని ఖరగ్‌ పూర్‌. మా పూర్వీకులది వైజాగ్‌. మా ముత్తాత బ్రిటీష్‌ సమయంలో రైల్వే కూలీగా బెంగాల్‌ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు” చెప్పుకొచ్చింది.

“మీ తెలుగు ఎంతో స్పష్టంగా ఉంది. మీ అమ్మానాన్నల్ని అభీనందించాలి.. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం,,” అనీ అడిగా.

“మా ఇంట్లో ఇప్పటికీ తెలుగే మాట్లాడతాం... మా ఖరగ్‌ పూర్ణో తెలుగు వాళ్లు ఎక్కువమందే ఉన్నారు. నాకు మీ విషయం

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఆ ఇలై-2020 |


అర్థం కావడం లేదు? ఎక్కడ ఉన్నారో తెలియకుందా ఇక్కడికి ఎలా వచ్చారు? అనీ ఆశ్చర్యపోయింది.

నా కథంతా కుప్తంగా చెప్పా... తెలుగు తల్లి కృపా కటాక్షం వల్ల ఎక్కడెళ్ళ్మడ ఎలా తిరుగుతున్నానో వివరించా.

“మీ కథలో వేనూ ఓ భాగవ్రాపోయినందుకు ఎంతో సంతోషంగా ఉంది” అంటూ నమస్మరించింది.

తెల్లవారుతోంది. దట్టమైన పొగమంచు కమ్ముకుంది.

“'మనం ఉన్న ఈ ప్రదేశం ఇండోనేషియాలోని జోగ్యకర్త అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న బొరొబుదూర్‌. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాతి బౌద్ద స్థూపం. యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌. ఇండోనేషియాలో ఫారిన్‌ టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రదేశమిది. ఓ కొందనంతా తొలిచి మండలం ఆకారంలో స్థూపంలా మలిచారు. తెలుగు జాతి గొప్పతనానికి సంబంధించి ఈ స్ఫూపంలో ఎన్నో సాక్షాధారాలు ఉన్నాయి. అందుకే డెన్టినీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. సూర్యోదయానీకంటే ముందే మనం కొండ పైకి చేరుకోవాలి. వెళదాం పదండి..” అంటూ లేచింది.

కాలు కణుక్కువున్నట్టుంది.. నొప్పితో అమ్మా అంటూ కూర్చుండిపోయింది.

నన్ను పట్టుకుని నడవండి. చేతిని సాయంగా అందించా.. నెమ్మదిగా లేచింది. ఆమె బ్యాక్‌ ప్యాక్‌ ను తీసుకుని నా భుజానికి వేసుకున్నా. ఇద్దరమూ కలిసి మెట్లెక్షడం ప్రారంభించాం. నా వెనుక