ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొత్తూరితో బి. ఎస్‌.వరదాచారి, గోవిందరాజు చక్రధర్‌, కొందా లక్ష్మణరావు,

ప్రసాదరాయ కులపతి. గుంటూరులో వీరిద్దరికి చిన్ననాటినుంచి ఆత్మీయస్నేహం ఉందేది. స్వామివారి జీవితచరిత్రను యతికులపతి పేరుతో రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం కాశీనాధుని నాగేశ్వరరావు వంతులు జీవిత చర్మితను నమ[గంగా పొందుపరిచారు.

కులదీప్‌ నయ్యర్‌ ది జర్జ్‌మెంట్‌ను మరొకరితో కలిసి తెలుగులోకి అనువదించారు. మాజీప్రధాని వి.వి నరసింహారావు “ఇయర్స్‌ ఆఫ్‌ పవర్‌” ను మరో ఇద్దరితో కలిసి ఇంగ్లీషులో రాశారు.

ఆత్మకధకు కొనసాగింపుగా చరమ అధ్యాయం రాయవాలని పరితపించారు. ఒక అధ్యాయానికే ఎందుకు పరిమితం చెయ్యడం, వందపేజీల పుస్తకంగా తెస్తే విడిగా ప్రచురించవచ్చని నేను సూచించాను. ఆపుస్తకంలో ఏయే ఆధ్యాయాలుంటే బావుంటుంది, టి అధ్యాయంకింద ఏమే విషయాలు చెప్పవచ్చు కూదా వివరంగా ప్రణాళిక రూపొందించి, పొత్తూరి గారినీ కలిసి అందించాను. దానీపై వివరంగా చర్చించాను. అయితే అనారోగ్యం, జ్ఞాపకశక్తి తగ్గించడంతో ఈ రచనను ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు.

“వాసిరెడ్డి సీతాదేవి దగ్గర్నుంచి అనేకమంది నన్ను పుస్తకాలు ప్రచురించాలని సలహా ఇచ్చారు. కానీ మీరొక్కరు మాత్రమే నాపుస్తకాల ప్రచురణకు ముందుకు వచ్చి, దాన్ని సాకారం చేశారు” అని పదేపదే అంటుందేవారు. అత్మగౌరవం

ఆత్మగౌరవానికి రవ్వంత భంగంకలిగినా పొట్లూరి సహించేవారు కారు. ఎదుటివారిని కూడా చిన్నాపెద్దా తేదాలేకుందా ఆత్మీయంగా, మర్యాదపూర్వకంగా పలకరించేవారు. ఒకప్పుడు కోర్టుహాలులోకి ప్రవేశించే ముద్దాయి ఎవరైనా సరే, చెప్పులు బయటే విడిచివెళ్లి కోర్టుహాలు బోనులో నీలబడాల్సివచ్చేది. అభియోగం దాఖల్హైనంతవాత్రాన వబద్దాయినీ ఇలా అవమానించటం అన్యాయమని పొత్తూరి భావించారు. సంపాదకుడిగా ఒక కేసులో కోర్టుకు హాజరైన ఆయనకే ఈ చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న లక్ష్మణరావు దృష్టికి ఈ విషయం తెచ్చి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. జస్టిస్‌ లక్ష్మణరావు

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఇజలై-2020 |

కూడా ఇది అనవసర ఆనవాయితీ అని భావించి, చెప్పులు బయటే విడిచిరావాలన్న నియమాన్ని అన్ని కోర్టులలో రద్దుచేస్తూ ఉత్తర్వులు జాదీ చేయించారు. ఇలా పొత్తూరి ఆత్మాభిమానం, అందరి గౌరవాన్ని నిలిపే మంచి మార్పుకు మార్గం వేసింది.

సున్నిత హృదయుడు

పొత్తూరి ఎంతటి సున్నీత హృదయుడో చెప్పటానికి స్వానుభవమే రుజువు. ఒకసారి ఏదో పనీ ఉండి ఉదయం 11 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళి ఒంటిగంట అవుకుండటంతో సెలవు తీసుకున్నాను. గేటుదాకా వచ్చి సాగనంపడం ఆయనకు అలవాటు. నాకు వీడ్మోలు చెప్పేందుకు పొత్తూరి ఉద్యుక్తుడవుతున్నారు. నేను అక్కడ ఉన్నాననే సంగతి తెలియనీ పొత్తూరి వారి అర్దాంగి, “ఖోజనానీకి లేవండి” అంటూ లోపలిగదిలోనుంచి ఆయనను పిలిచారు. నేను హడావిడిగా గుడ్‌బై చెప్పి వచ్చేశాను. ఇంటికి చేరుకుని భోజనంచేసి కూచోగానే సొత్తూరునుంచి ఫోను.

“ఏం బ్రదరూ! భోజనం అయిందా?” అంటూ సంభాషణ మొదలు పెట్టారు. “వ్రేశ్రానండీ” అన్నాను.

“సారీబ్రదర్‌! మిమ్మల్నికూడా నాతోపాటు భోజనానికి ఉండమనాల్సింది. నాకు తోచలేదు” అన్నారు అపరాధ భావనతో.

“అనుకోకుండా భోజనమంటే ఇంట్లో వారికి ఇబ్బంది. ఖోజనానీదేముంది!? ఈసారి వచ్చినప్పుడు చేస్తాలెండి” అన్నాను నచ్చచెహ్హూ.

“మాఇంట్లో ప్రతిరోజూ అదనంగా ఇద్దరు ముగ్గురికి వండుతారు. ఆ ఇబ్బందేమీ లేదు. ఆవిడకూ మీరున్నట్లు తెలీదు. లేకుంటే ఆవిదైనా భోజనానికి ఉండమనేది” అంటూ బాధపడ్డారు. ఎంతటి సున్నిత మనస్ముడో కదా అన్పించింది. అందరితో అల్మీయబంధం

2013లో మల్టిపుల్‌ మెలనోమా (ఒక రకమైన బ్లద్‌కాన్సర్‌)కు గురయ్యారు. అత్యాధునీక చికిత్స తీసుకుంటూనే ఎక్కదా నీరాశను దగ్గరకు రానివ్వలేదు. జీవితేచ్చ కోల్పోలేదు. లౌకిక విషయాలపట్ల ఏమాత్రం ఆసక్తి తగ్గించుకోలేదు. మితులకు రెండుమూడు వారాలకొళసారి ఫోన్లు చేస్తూ తనే వలకరించేవారు. వారితో అనేకానేక విషయాలు మాట్లాడుతుండేవారు. అందర్నీ అపేక్షగా “బ్రదర్‌” అనీ పిలుస్తుందేవారు.

“ఖదర్‌! ఎక్కువ సమయం లేదు. తరచు కలుస్తుందండి” అని ఫోను పెట్టేవారు.

ఈ మహమ్మారితో శరీరం ఛిద్రమైపోయిందని, మందుల ప్రభావంతో జ్ఞాపకశక్తి తగ్గుతోందని బాధపదేవారు.

పొత్తూరివారు కోరుకున్నట్సే వీలున్నవ్చుడల్త్లా నేనూ, కుదిరినవుడు జీ.యన్‌.వరదాచారి, కొండా లక్ష్మణరావు, సి.వి.నరసింహారెడ్డి వంటి వారిని కలువుకునీ పొత్తూరి ఇంటికి వెళ్ళేవాణ్సి. ఇలా వెళ్ళిన ఒక సందర్భంలో మండలి బుద్ధప్రసాద్‌కూడా అక్కడ తారసపడ్డారు. ఆశ్చర్యమూ, ఆనంపమూ కలిగింది.

ఆం([్రజనత రోజులనుంచి అనేకానేక విషయాలను నెమరువేసుకుంటూ ఆ కబుర్లతో ఆనందించేవారు సొత్తూరి.

ఆయన పూర్ణపురుషుడు, ధన్వజీవి. అంతటి మేరునగధీరుడి సాన్నిహిత్యం దొరకడం నా అద్బష్టం.