ఈ పుటను అచ్చుదిద్దలేదు

అందులో తావులేదని అనేక బౌద్ద రచనల ద్వారా అర్ధమౌతుంది. హేకతుబద్ద, లౌకిక, నైతిక, బహుజన హితాన్ని కాంక్షించే వైఖరి కలిగిన బౌద్దం అంబేద్యర్‌ను ఆకర్షించింది. సమాజంలోని ఏదో ఒక అణగారిన అస్తిత్వ ప్రయోజనాలను కాక్టించి, వాటికే పరిమితమైన దృక్పథం స్థానంలో తీవ అసమానతలు, ఘర్షణలు, దుఃఖంలో ఉన్న సామాజిక వాజావరణం, సమస్యల నుంచి మొత్తం మానవాళి విముక్తిని బౌద్ధం కోరుకుంటుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తదితర వర్దాల పరస్పరాధారిత, పరస్పర పూరక స్వభావంతో ఉన్న భారతీయ సమాజంలో అణగారిన వర్ధాల విముక్తి పునాదిగా మొత్తం మానవాళి నీర్వాణాన్నీ కోరుతూ ఒక సమ(గ్ర విప్లవంలాగా బౌద్దం ఉనికిలోకి వచ్చింది. అంటే అణగారిన వర్షాల, వరాల అభ్యున్నతి, స్వేచ్చ, సమానత్వాల పునాదిపై, వారి ప్రయోజనమే ఆధారంగా మొత్తం మానవాళి నిర్వాణానికి బౌద్దం కృషి చేసింది.

పాలకులు, పాలితులు, అగ్రవర్జాలు, అణగారిన వర్గాలు, వర్జాలు అందరినీ వేధిస్తున్న సామాజిక, అధ్యాత్మిక వాజావరణాన్ని మార్చేందుకు సమకాలీన 77 తాత్విక ధోరణులతో అల్లకల్లోలంగా ఉన్న సమాజాన్ని ఉపశమింప చేసేందుకు, వాటిని పూర్వపక్షం చేస్తూ శాంతియుత మధ్యేమార్గ తాత్వికతను బుద్దుడు ప్రజలకు అందించాడు. ఆధ్యాత్మిక అస్తవ్యస్తతను సరిచేస్తూ పాలకులను, పాలితులను అలాంటి థర్మపథం వైపు శతాబ్దాలపాటు బౌద్ధం నడిపించింది. పాలకుల, ప్రజల ఆధ్యాత్మిక దృక్పథంలో హేతుబద్దమైన విప్లవాన్ని బౌద్దం తీసుకొచ్చింది. పర్యవసానంగా సుస్థిర మార్కెట్లు, సుస్థిర సమాజం పునాదిపై ప్రజాజీవన వికాసం, వైజ్ఞానిక

వికాసం వెరసి మానవ వికాసానికి మార్గం సుగమం చేసింది. నాన మత, భాష్క (ప్రాంత, లింగ, జాతి తదితర అస్తిజ్వాలు, వర్గ అసమానజలు వంటి వివిధ సామాజిక సమూహాల మధ్య ఘర్షణల కారణంగా ఏర్పడిన అశాంతి, బాధలకు విముక్తి, విడి విడి అస్తిజ్వాల ఒంటరి పోరాటాలవల్ల సాధ్యం కాదనే సత్యాన్ని బౌద్ధం అనాదే గుర్తించింది. విడి విడి అస్తిత్వాల సమస్యలకు విడి విడి పరిష్కారాలను కాకుండా, అ అస్తిజ్వాల అంశీభూతాలతో సజీవ మొత్తంగా (ఆర్గానిక్‌ హోల్స్‌ ఏర్పడిన సమాజమంతటినీ విముక్తి చేసేందుకు బౌద్ధం “అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది.

సమాజంలోని కష్టాలకు, దు;ఖాలకు గల కారణాలను బౌద్ద దార్శనికత వ్యక్తిగతంగానే చూస్తోందిగానీ, వెబత్తం సామాజిక సంబంధాల చలన నియమాలలో అంతర్భాగంగా, సామాజికంగా వాడలేకపోయింది. నమాజంలోని చెడును పెకలించివేయడం కాకుండా, వ్యక్తుల నుంఛి దాన్ని తొలగించేందుకు అష్టాంగ మార్గం వంటి వైయక్తిక పరిష్మారాన్నీ (ప్రతిపాదించింది. ఆ ప్రతివాదనను నమకాలీన పరిష్కారంగా చూడటమంటే ఆ యుగపు చారిత్రక అర్ధరాహిత్యంతో పాలుపంచుకోవడం మాత్రమే. మతవాద టెంకెను పదేసి, సమకాలీన సామాజిక అంతస్సారం, సామాజిక నిర్వాణం పునాదిగా వౌద్దాన్ని అంబేడ్మర్‌ సంస్కరించదలిచారు. బౌద్దాన్నీ వైయక్తిక పరిష్కార మార్గం నుంచి వర్ష పోరాటం, సామాజిక సమానత్వం వైపుకు మళ్లించేందుకు అంబేద్మర్‌ కృషి ప్రారంభించారు. “ధర్మ చక్ర పరివర్తన విజయ వంతమైన ఆరు మాసాల్లోనే ఆయన మరణించడం వల్ల ఒక గొప్ప దార్భ్శనీక ధార ప్రారంభంలోనే ఆగిపోయినట్లయింది. అంబేద్మర్‌ అనుయాయులు ఆయన నవయాన బోధనల సారాన్ని (గ్రహించడంలో పూర్తిగా విఫలమై బుద్దుడిని, ఆయన్నీ దేవుళ్లను చేసేశారు

భీమ్‌ను మలచిన రాజ్యాంగం:

అంబేద్కర్‌ అనగానే దళిత సామాజిక నవవాహాలకు ప్రాతినిథ్యం వహించే లేదా వారి నుంచి ఉద్భవించిన జాతీయ

| తెలుగుజాతి పత్రిక అవ్వునుడి ఆ ఖజలై-2020 |

శా యేరా పలువురు భావిస్తారు. నీజమే. ఆయనలో ఈ రెందు ఛాయలు ఉన్నమాట నిజమే. బ్రిటీష్‌ వలసకాలంలో- ప్రధానంగా ఆయన రచనలు అణగారిన వళలిత, అస్పృశ్య ప్రజానీకం పరిస్థితులు, సామాజిక అణచివేత, వివక్ష తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం అటు బ్రిటీష్‌ ప్రభుత్వంతోనూ ఇటు స్వాతంత్రోద్యమకారులు, దేశీయ అగ్రకుల పెత్తందారులతో ద్విముఖంగా ఆధ్యాత్మిక, భౌతిక పోరాటాలు చేయవలసివచ్చీంది. సమకాలీన సామాజిక వాస్తవికతకు అనుగుణంగా ఆయన వ్యవహరించారు. అందులో భాగంగా కమ్యూనిస్థు/కార్మికో ద్యమాల్లో కులం పాొథత, వర్గపోరాటంలో (ప్రత్యామ్నాయంగా కాదు) కులనిర్మూలన పోరాటానీకున్న విశిష్ట స్థానం వగైరా అంశాలపై కమ్యూనిస్టులతోను తనదైన శైలిలో ఆయన ఘర్షణ పడడం సరైనదే. దాంతో ఆ కాలమంతా ఆయన పోరాటం కుల వ్యవస్థ (క్రూరత్వాన్ని ప్రతిఘటించవలసిన అగత్యాన్ని జాతీయ రాజకీయ ఎజెందా మీదకు తీసుకురావడంపైనే కేంద్రీకృతమైంది. ఆ మేరకు ఆయన విజయవంతమైనారు. పర్యవసానంగా దళిత వర్గానికి ప్రాతినిధ్యం వహించే నాయకుడుగా ఆయన్ని చిత్రించారు. అయితే దళిత, అస్పుశ్యుల సమస్య ఏదో కొద్దిమంది ప్రజలకు సంబంధించినదిగా పైకి కనబడుతున్నప్పటికీ, మొత్తం సమాజ స్వభావాన్ని సామాజిక పురోగతిని నిర్ణయించే కీలక సమస్య అది. అణగారిన కులాల సమస్య అయా ప్రజాసమూహాలకు మాత్రమే పరిమితమైన సమస్య ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే మొత్తం కులవ్యవస్థలో దొంతర్ల రూపంలోని అసమానతలు, అణచివేతలు దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్జుకుంటోంది. ఖక ఏకరీతి జాతిగా సంఘటితం కానంతవరకు ఒక జాతిగానీ, ఒక దేశంగానీ ప్రగతికీ, పురోగతికీ ఏ మాత్రం నోచుకోక చారిత్రకంగా గిడసబారి పోతుంది. తొలి అంబేద్మరిజం దేశంలోని కులవ్యవస్థ, అణచివేత, క్రూరమైన అస్పృశ్యతను జాతీయ రాజకీయ ఎజెండాలో ఖాగంచేసే కృషిగా అర్ధం చేసుకోవాలి.

స్వాతంత్రానంతరం 1947 అక్సోబర్‌ 29వ తేదీన రాజ్యాంగ