ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి రామారావు 95508 67563

“'ఖీమ్‌' ఆశించిన బౌద్ధం

కులవ్యవస్థకు మూలమైనడిగా అపఖ్యాతిని మూటగట్టుకున్న వాొందూ వుతం గురించి, దానికి తగిన ఆధ్యాత్మికతా ప్రత్యామ్నాయం గురించి అంబేద్మర్‌ తీవ్రంగా అధ్యయనం చేశారు. మతాన్ని సామాజికతాతీతమైనదిగా లేదా దైవికమైనదిగా కాక సామాజిక దృక్చథం పునాదిగా సాగే ఒక జీవన విభానంగా ఆయన పరిగణిస్తారు. సమాజం కోసం మతం ఉండాలి గానీ, మతం కోసం నమాజం ఉండకూడదనేది ఆయన భావన. ఈ అవగాహనలో భాగంగా ఆయన హిందూమతాన్ని దానికి ప్రత్యామ్నాయంగా అనేక మతాలను అధ్యయనం చేస్తూ చివరికి అనేక సంస్కరణలను ప్రతిపాదిస్తూ బౌద్ధ మతాన్ని ఆమోదించారు. సామాజిక (శ్రేయన్సుకు మతం అవనరమని, అయితే గుడ్డి విశ్వాసాలు, మూఢనమ్మకాలు, అస్తిత్వ అంతరాలు, అణచివేతలతో

కూడిన మతం సమాజాభివృద్ధికి ప్రతిబంధకమని ఆయన భావించారు. కుల అణిచివేత లేని హిందూమతంగా రూపాంధించాలనే సైద్ధాంతిక భావనను ఆచరణాత్మక వాస్తవికతగా మార్చాలని జాత్‌ పాత్‌ తోడక్‌ మండలి సమావేశ ఉపన్యాస పాఠమైన 'కుల నిర్మూలని (గ్రంథంలో ఆయన పిలుపిచ్చారు. ఆ మార్గంలో రామానుజాచార్యులు, కబీర్‌ వంటి వారి కృషిని ఆ సందర్భంగా ఆయన ప్రశంసించారు.

'బహ్మ సమాజ్‌, “ఫార్ధనా సమాజ్‌. హిందూ సంస్మరణవాద మత సంస్థలు కుల కొట్లాటలు, వివక్షతలను ఉపశమింప చేసేందుకు విఫలప్రయత్నం చేశాయి. అదే సమయంలో “సత్యశోధక్‌ సమాజొఅనే సంస్మరణవాద సంస్థను స్థాపించిన జ్యోతిబా ఫూలే తన ఛివరి రోజుల్లో ఏర్పాటు చేసిన 'సార్వజనిక్‌ సత్యధర్మ అనేమత స సంస్ధ సైతం అంబేద్మర్‌ హేతువాద అఖభినివేశానికి వేదిక కాలేక పోయింది.


దాంతో అంబేద్మర్‌ అధ్యాత్మిక అన్వెషణకు కొన్ని సవరణలతో కూడిన బౌద్ధం చివరి మజిలీగా నిలిచింది.

నవయాన బౌద్ధం

19298 జలగావ్‌ బహిరంగ సభలో అంబేద్మర్‌ మాట్లాడుతూ “మిమ్మల్ని మానవులుగా గుర్తించి, ప్రపంచంలో ఎదిగేందుకు సమాన అవకాశాలను కల్పిస్తూ, మను షులు వలె తినడం, నడవడం, బతకడం వంటి వాటిని సాధ్యమయ్యేట్లు చేయగలిగే ఏ మతాన్నైనా మీరు స్వీకరించవచ్చు అని మొదటిసారిగా మత ధిక్కార స్వరాన్ని విని పించారు. ఆ తర్వాత క్రమంగా బౌద్ద ధర్మాన్ని ఆయన అధ్యయనం చేసి, దానివైపు విమర్శనాత్మక వైఖరితోనే మొగ్గు చూపారు. కుల వ్యవస్థ అంటరానితనం వంటి సామాజిక నీచత్వాలను ఆమోది స్తాయా లేదా వ్యతిరేకిస్తున్నాయా అనే అంశాన్నీ మాత్రమే అంబేద్మర్‌ ప్రామాణికంగా తీసుకోలేదు. క్రైస్తవం, ఇస్లాం, బౌద్దం, జైనం, సిక్కు మతాలు హిందూ మత సామాజిక నీచత్వాలను పూర్తిగా వ్యతిరేకించ నూలేదు ఆయన వాదించడమూ లేదు. దళితులకు మరింత రాజకీయ బలం, అధికారం కోసం మత మార్పిడి ప్రతిపాదనను ఆయన ముందుకు తీసుకురాలేదు. అదే సమయంలో విదేశీ మతాలైన ఇస్లాం లేదా కైస్తవంలోకి మారితే తనవారిపై హిందూ మత దురహంకార దాడులు జరుగుతాయేమోననీ అంబేద్మర్‌ భయపడి దేశీయ మతమైన జౌద్దంలోకి మారారనే అభిప్రాయమూ బాగా ప్రచారంలో ఉంది. రాజకీయ ప్రయోజనాల వంటి సంకుచిత, చిల్లర కారణాల రీత్యా ఆయన బౌద్ధం తీసుకోలేదు. “నేను బుద్దుని బోధ నలను ఆమోదిస్తాను, అనుసరిస్తాను. హీనయాన, మహాయాన అనే

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఇజలై-2020 |

ట్‌ మత థోరణుల ఖిన్నాఖిప్రాయాలకు దూరంగా నా ప్రజలను ఉంచుతాను. మా బౌద్దం నయా-బౌద్ధం, నవయానరాి అని అంబేద్మర్‌ నాగ్‌పూర్‌లోని శ్యాం హోటల్‌లో 1956 అక్టోబర్‌ 13 తేదీన జరిగిన పత్రికా సమావేశంలో ప్రకటించారు. ఆ మరుసటి రోజు “ధర్మచక్ర (ప్రవర్తన దినంగా (ప్రసిద్ధికెక్కిన ఆక్షోబర్‌ 14తేదీన నాగ్‌పూర్‌ దీక్షాభూమిలో అంబేద్మర్‌ తన అనుయాయులతో బౌద్ద మత స్వీకరణ కార్యక్రమం మొదలైంది. రెండు రోజుల్లో దాదాపు 3,80,000 మంది ఒక్కసారిగా హిందూ మతం నుంచి అంబేద్మర్‌ పతిపాదించిన నవయాన బౌద్ధమతాన్ని స్వీకరించారు. థేరవాచ, మహాయాన, వజ్రయాన తదితర బౌద్ద శాఖలకు ఖీన్నంగా నవయానం, లేదా ఖీమయాన బౌద్ధం పేరుతో ఆ తర్వాత కాలంలో అది విస్తరించింది. ఖీక్షువులు, ఆరామాల సంస్కృతి, కర్మ పునర్జన్మ, ధ్యానం, నాలుగు ఆర్వ్యసత్వాలు, జ్ఞానోదయం వంటి అహేతుక భావన లను, ఆచరణలను కలిగిన సంప్రదాయ బౌద్ద శాఖలను అంబేద్కర్‌ వ్యతిరేకిస్తూ, వర్ష పోరాటాన్ని సామాజిక సమానత్వాన్ని బుద్దుని అసలైన జోధనలుగా నవయాన బౌద్ధంలో ఆయన ప్రతిపాదించారు. బౌద్ధంలోని దార్శనిక విశ్వజనీనతను కాక సామాజిక కోణాన్ని మాత్రమే అంబేద్మర్‌ పరిగణనలోకి తీసుకున్నారు.

“పతీత్య సముత్సాదం' అనే బౌద్ద తాత్విక చింతనను అంబేద్మర్‌ జీర్ణించుకోలేదు. అయితే “పవిత్ర (గ్రంథాలపూజను, దేవుడి భావన లను బుద్దుడు నిరాకరించినా అనుయాయులు మాత్రం ఆయన