ఈ పుటను అచ్చుదిద్దలేదు

లి చొరబాటు

రహ్మానుద్దీన్‌ షేక్‌ 9193635658

తెలుగులో తమిళ అక్షరాలా?

ఏప్రిల్‌ 80 న యూనికోడ్‌ కన్సార్టియం వారు ఒక కబురు ట్విట్టర్‌ లో పంచుకున్నారు. సారాంశం ఏంటంటే, తమిళంలోని రెండు అక్షరాలను తెలుగులో విరివిగా వాడుతున్నందున, వాటిని తెలుగు అక్షరాల్లో చేర్చాలన్న ప్రతిపాదనను ఇఅమోదిస్తున్నట్టు. ఈ ప్రకటన వలన తెలుగు యూనికోడ్‌ లో తెలుగువారికి తెలియకుందానేే, తెలుగువారి ఆమోదం లేకుండానే

రెండు తమిళ అక్షరాలు వచ్చి చేరనున్నాయని తెలిసింది.

యూనికోడ్‌ కన్సార్దియం అనేది అన్ని భాషల లిపుల అక్షరాలకు కంప్యూటర్‌/తర ఉపకరణాలలో విశ్వవ్యాప్తంగా ఒకే రీతిగా ఉందే కోడ్లను(సంకేతాలను) అందించడం చేసే అంతర్జాతీయ సంస్థ. ప్రపంచంలోని ప్రతి భాషకు 128 అక్షరాలను చేర్చుకునే వీలుగా యూనికోడ్‌ ఒక పట్టికను ఇస్తుంది. ఆ పట్టికలో ఆయా భాష లిపులలోనీ ప్రతి అక్షరానీకి ఒక సంకేతాన్నీ(కోద్‌ ను) ఇస్తారు. ఒక వ్యవస్థీకృత విధానం ద్వారా మనకు కావాల్సిన అక్షరాలను మనం ప్రతిపాదించి, ఆయా భాషలలో చొప్పించవచ్చు. అలా ప్రస్తుతం 143859 అక్షరాల సంకేతాలను భద్రపరిచే సామర్థ్యం ఉంది. ఇది భవిష్యత్తులో పెంచుకోవచ్చు కూడా (ఇప్పటికిప్పుడు 1,112,064 అక్షరాలను చేర్చవచ్చు. ఈ 143859 అక్షరాలలో మొదటి 128(0 తో మొదలు) సంకేతాలు ఆంగ్ల అక్షరాలకు ఖరారు చేయబడ్డాయి. తరువాతి 128 అనగా 129 వ సంకేతం నుండి 255 వ సంకేతం వరకు అదనపు లాటిన్‌, రోమన్‌ అక్షరాలకు ఉంచగా, అలా తెలుగు యూనికోడ్‌ పట్టిక 3072 స్థానం దగ్గర మొదలయి, 8200 స్థానం దగ్గ ముగుస్తుంది. ఇందులో ఇప్పటి వరకు తెలుగు అక్షరాలను, తెలుగు అంకెలను, గుణింతాలకు కావాల్సీన గుర్తులను, అవగహ, చంద్రవీందు, అర్భానుస్వారం లాంటి చిహ్నాలను, అత-పావు, ముప్పావు -అరపావు వెొొుదలగు ఖీన్నాలను తెలిపే గుర్తులను చేర్చుకున్నాం.

2012 లో తమిళ భాషలో మాత్రమే ఉన్నాయనుకున్న ళు గ అక్షరాలకు తెలుగులో కూదా పలు శాసనాలలో సమాన అక్షరాలను సూచిస్తూ సురేష్‌ కొలిచాల, వెన్న నాగార్జున మొదలగు వారు కొత్త అక్షరాలను ప్రతిపాదించారు. అవే ట్కిట,

అనగా ఇవి తమిళానికే ప్రత్యేక అక్షరాలు కావు. తెలుగులో వీటికి మన ప్రాచీన గ్రంథాలలో శిలాశాసనాలలో స్థానం ఉంది. అందుకని ఇవి మన జెలుగు అక్షరాలే.

అయితే ఇప్పుడు వివాదాస్పదమైన ప్రతిపాదనను కొద్ది రోజుల క్రితం 14 ఏప్రిల్‌ నాడు వినోద్‌ రాజన్‌ అనే తమిళ వ్యక్తి సూచించాడు. పై రెండు తమిళ అక్షరాలను అదే రూపంలో (తెలుగు సమాన అక్షరాలుగా కాకుండా) యథాతథంగా వైష్ణవ మత (గ్రంథాలలో, ముఖ్యంగా తిరుప్పావై, తీరువాయిమొళి లలో విరివిగా తెలుగువారు వాదుతున్నారనీ ఒక పదిపన్నెండు పాత పుస్తకాలను ఆధారం చేసుకుని యూనికోడ్‌ వారికి ప్రతిపాదించడం, యూనికోడ్‌ వారు దీనిపై పెద్ద చర్చ లేకుండానే, సరైన ఆధారాలున్నాయనీ ఆమోదించడం

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

జరిగిపోయింది.

రాబోయే యూనికోడ్‌ తెలుగు పట్టికలో ఈ రెందు అక్షరాలు జవం అవుతాయి.దీనిని వమనవుంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. ఇది నిరసించాల్సిన విషయం. దీని వలన తెలుగు భాషకు జరిగే చేటు అంతా ఇంతా కాదు. రేపు ఏవరైనా వ్యక్తి వచ్చేసి నా దగ్గర ముద్రిత పుస్తకాల ఆధారం ఉంది అని పీవో పరాయి అక్షరాలను తెచ్చి సునాయాసంగా తెలుగు యూనికోడ్‌ లోకి కలపవచ్చు.

తెలుగు యూనికోడ్‌ పట్టికను పరిశీలించిన ప్రతిసారీ, తమిళ అక్షరాలు రెండు తెలుగులో ఉన్నాయని ప్రతి ఒక్కరికీ అనిపించేలా కుట్రతో ఈ పనికి ప్రతిపాదకుడు రాజన్‌ సాహసించాడు. ముఖ్యంగా వ్యతిలేకించాల్సింది ఇప్పటికే తెలుగులో తెలిసిన అక్షరాలకే వాటి తమిళ సమాన అక్షరాలను జెచ్చి పక్శనే సిలపటం.

ఇదెలాగుందంటే, పేరు చివర చదువును తెలిపే 8.4. 14... 8.160., లాంటి అక్షరాలు రాస్తున్నాం కాబట్టీ వాటినీ తెలుగు భాషలోకి కలిపేయాలి అన్నట్టు. కొన్ని కోట్ల ప్రజలు మాట్లాడే భాషకు సంబంధించిన లిపిని కంప్యూటర్లకు వాదే దిక్సూచిగా ఉండే యూనికోడ్‌ ను ఒక వ్యక్తి మార్చేయటం జరగకూడదని పని. ఆ హక్కు తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థ ద్వారా కానీ, (ప్రభుత్వం ద్వారా కానీ జరగాలి. భాష యూనికోడ్‌ పట్టికలో జరిగే మార్పుకు ప్రతిపాదన ప్రభుత్వం ద్వారానే రావాలి. ఇందుకు ఒక నియమావళి ఉంచాలి. ఈ ఘటనను ఒక గుణపాఠంగా తీసుకొని మన ప్రభుత్వాలు తెలుగు భాషా ప్రాధికార సంస్థను ఇప్పటికైనా నెలకొల్పడం చేస్తే మంచిది. అ ప్రాధికార సంస్థ ఇటు తెలుగు ప్రజలతో, తెలుగు భాషా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, అటు యూనికోడ్‌ కన్సార్టియం లాంటి అంతర్జాతీయ సంస్థలకు అధికారిక ప్రతినిధిగా ఉండగలదు.

ఇక సదరు ప్రతిపాదన విషయానికి వద్దాం- అందులో అతను తిరుప్పావై వి అరు రకాల ప్రతులు బుజువుగా చూపించాడు. కానీ తిరుప్పావై లో తమిళ ల్ర స్థానంలో తెలుగు ళ/జ ను, తమిళ [గు స్థానంలో తెలుగు ట్ర/జ్ఞ వాదే పుస్తకాలు ఐజారులో కోకొల్లలు దొరుకుతున్నాయి. తమిళంలోనే అక్షరాలు ముద్రించే ముద్రాపకులకు తెలుగులోనూ ఈ అక్షరాలు ఉన్నాయన్న స్పృహ లేదు. ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలో, బాపు బొమ్మలతో వచ్చిన పుస్తకం తిరుప్పావై దివ్యప్రబంధం, మేలుపలుకుల మేలుకొలుపులు పుస్తకంలో

క్ష్‌