ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంగ్ల భాష లేకపోతే అభఖివృద్ధిలేదు అనేది కేవలం మన భావ దాస్యం నుంచి పుట్టిన అభిప్రాయం మాత్రమే!

శిశువు తల్లి నుండి వెుదటి పాఠాలు నేర్చుకుంటుంది. అందువలన ఒక దేశంలో ఉన్న వారికి ఆ దేశ మాతృభాష కాకుండా వేచే. భాషని అంటకట్టడం మహా పాపం.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విద్య ఆనందదాయకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పిల్లలకు విద్యా బోధన మాతృభాషలోనే ఉందాలి అనే తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని కాకపోతే ఆంగ్లాన్ని స్థాయికి తగినట్లుగా కొద్ది కొద్దిగ ప్రవేశపెడుతూ మాతృభాషకు అంగముగా మాత్రమే ఉందేలా చూడాలని అన్నారు.

దాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ గారి దృష్టిలో చదువంటే భగవంతుడికి నన్నిహితంగా తీసుకానిపోయేదే. 'స్టలకాలాలకు అతీతంగా ఉందే అదృశ్య ప్రపంచాన్ని చూసేందుకు సహకరించేది అసలైన చదువు” అంటారాయన. పై మహాత్ముల అభిప్రాయాలను గమనించిన తర్వాత విద్యార్థి పరివర్తనకు మాతృభాషే అసలైన సాధనం అని స్పష్టమవుతోంది.

మూడవ (ప్రశ్న

రాజ్యాంగం లోని ఎనిమిదో షెడ్యూల్లో హిందీ నీ జాతీయ భాషగా ఉంచేటట్లు ఇతర భాషలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేటట్లు ఆమోదించారు. [పపాథమీక స్థాయిలో మాతృభాషే బోదన మాధ్యమంగా ఉండాలని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారు నొక్కి చెప్పారు. ఉన్నత స్థాయిలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాచ్చు అన్నారు.

స్వాతంత్రానంతరం విద్యకు సంబంధించి అనేక కమిషన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ 1955 బోధనా మాధ్యమం గురించి ప్రత్యేకంగా చెప్పింది. కమిషన్‌లోని 775 పేరాలో వివరించారు. [౧౬ 1968 కూడదా భాషల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. విద్యా సాంస్కృతిక అభివృద్ధి కోసం భాషలను అభివృద్ది చేయడం అత్యావశ్చకం అని చెప్పింది. ఈ పని జరగకపోతే ప్రజలలోని సృజనాత్మక శక్తులు బహిర్గతం కావని న్పష్టం చేసింది. విద్యా ప్రమాణాలు పెరగవని ఖరాఖండీగా చెప్పింది. విజ్ఞాన వ్యాప్తి జరగదు అనీ చెప్పింది. వేధావులకు సామాన్యులకు మధ్య అగాథం పెరిగిపోతుందనీ అభిప్రాయపడింది. ఇప్పటికే స్థానిక భాషలోనే 'పాథమిక విద్య బోదింప పడుతోంది. విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకానిపోవడానికి సత్వర చర్యలు చేపట్టాలి. ఈ కమిషన్‌లు ప్రతిపాదించబడిన త్రిభాషా సూత్రం అన్ని రామాలు చిత్తశుద్దితో చేయలేదు. చిన్న రాష్ట్రాల్లో మాత్రం ఫలితాలు చక్కగా వచ్చాయి.

ప్రజలు అడుగుతున్నారు కాబట్టి మేము అందరికీ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పడం దానీ మౌలిక బాధ్యతను విస్మరించడమే! ఎందుకంటే చాలా విషయాలలో ప్రభుత్వం దానంతట అదిగా ముందుకు వచ్చి ప్రజలకు ఏది క్షేమమని భావిస్తుందో అదే పనిని బలవంతంగానైనా చేయిస్తోంది.

కరోనా (ప్రాణాంతకంగా మారినప్పుడు ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించింది కదా!

నీరక్షరాన్యులైన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి మా అబ్బాయిని చితకబాదండి అనీ అటిగినా కూడా తెలివైన ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడు? కొడితే చదువు రాదు. మీ విల్లవాడికి

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

మేము నచ్చజెప్పి చదువు చెబుతాం అంటున్నాదా లేదా?

యుక్త వయసు రాకముందే బాల్య వివాహాలు చేస్తే శిక్షలు విధిస్తూ ఉన్నామా లేదా ఇలాంటివి ఎన్నయినా ఉదాహరించవచ్చు. కోర్టు తీర్పులో విద్యార్థి వ మాధ్యమాన్ని ఎంచుకోవాలి అవే విషయాల్లో అధికారం తల్లిదండ్రులకు సంరక్షకులకు ఉంటుందని తేల్చి చెప్పింది

(ప్రాథమిక విద్యలో విద్వాభ్యాసం కొనసాగించే విద్యార్ధికి జోధన మాధ్యమానికి సంబంధించిన అవగాహన పరిణతి ఉండవు కాబట్టీ ఆ బాధ్యతను తల్లిదండ్రులకు కేటాయించిందని అనుకోవచ్చు. నిజానికి మేధావుల అధ్యయన ఫలితంగా వచ్చిన అంశాలను పరిశీలించి [ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగాలి అని నిర్దేశించడం ప్రభుత్వ నైతిక విధి. దీన్ని పాటించకపోగా దీనికి పూర్తి వ్యతిరేక నిర్ణయం తీసుకొని అమలు వరచబోవడం శోచనీయం తల్లిదండ్రులు అంగ్ల మాధ్యమాన్ని ఎందుకు అడుగుతున్నారు?

తల్లివం[క్రులు అడిగారు కాబట్టి మేము ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నాము అని చెప్పబోయే ముందు అసలు తల్లిదం[డ్రులు ఆంగ్ల మాధ్యమానికి ఎందుకు అంత (ప్రాముఖ్యం ఇస్తున్నారు? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే బిటిష్‌ వాడి ఆధిపత్య ధోరణికి, భారతీయుడి దాస్య భావనకు ఫలితమే ఈ కోరిక. స్వాతంత్రం తరువాత శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించే అభివృద్దికి మాధ్యమంగా ఆయా మాతృభాషలను సుసంపన్నం చేసుకోవాల్సిన కర్తవ్య నీష్ట ఆయా భాషీయులడదే! దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు గానీ ప్రజలు గానీ ఈ విషయంలో చూపించాల్సినంత చారవ చూపించక పోవడంవల్ల విజ్ఞానం చాలా సందర్భాలలో ఆంగ్ల భాషలోనే అందుబాటులో ఉందసాగింది. దాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగావకాశాలను కైవసం చేసుకోవడం కోసం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదవడానికి ప్రోత్సహించారు. ఇది మొదట్లో ఉన్నత విద్యకు మాత్రమే పరిమితమై ఉందేది. రాను రాను దీనిపై అటు ప్రజలకు ఇటు ప్రభుత్వాలకు అపోహలు ఎక్కువయ్యాయి. ఇంగ్లీష్‌ ను ఒక భాషగా చదువుకోవడం కన్నా మొత్తం మాధ్యమమే ఆంగ్లంలో ఉంటే ఆ భాషలో ఇంకా పట్టు బాగా సాధించవచ్చు అనీ విశ్వసించారు. ఇది అశాస్త్రీయం . హేతుబద్దం కాదు అనీ చరిత్ర నిరూపింఛింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకటో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ అయిపోయే వరకు అంగ్ల మాధ్యమంలోనే చదివిన విద్యార్ధినీ విద్యార్దులు కూడా కమ్యూనికేషన్‌ స్కిల్‌ లేక ఉద్యోగాలు ఫొందలేకపోవడం చూస్తున్నాం. కేవలం మాధ్యమం ద్వారా భాష వచ్చేటట్లు అయితే ఇటువంటి పరిస్థితి తల ఎత్తకూడదు. మరి పొరపాటు ఎక్కడ జరిగింది అని విశ్లేషించుకుంటే తేలేది ఒకటే విషయం. ఆంగ్లాన్ని ఒక భాషగా చెప్పినా ఇబ్బంది లేదు. కానీ ఆ చెప్పే విధానం సరిగా ఉంచాలి. మిగతా సబ్జెక్టులు ఏ భాషలో చదివారు అన్నది ముఖ్యం కాదు. ఈ పొరపాటును సరిదిద్దుకోకుండా ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా వ్యర్థమే! ప్రభుత్వానికి నిజంగా వెనుకబడిన వర్గాల పిల్లల శ్రేయస్సు పై దృష్టి చిత్తశుద్ది ఉంటే ముందు వారికి ప్రాథమిక విద్యను మాతృభాషలో పటిష్టంగా అందించి "సెకండరీ స్థాయిలో అంగ్లాన్ని ప్రవేశపెట్టి సమర్ధులైన అంగ్ల ఉపాధ్యాయులతో అంటే అ సబ్జెక్ట్‌ ను ఎలా బోధించాలో తెలిసిన నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులతో బోధింప