ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్గత అంశమే! మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు19() | కల్చిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అందరూ తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమంలోనే చదువు కొనసాగించాలి అనీ చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘనే! అలాగే అధికరణ. 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్చను నిరాకరించదానికి వీలులేదు. ఈ రకంగా 81, 85 జీవోలు విద్యాహక్షు చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా ఉన్నాయనీ కోర్టు అభిప్రాయపడింది.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కేంద్రం స్పందించింది. ఎన్సిఎఫ్‌ 2005, విద్యా హక్కు చట్టాలకు అనుగుణంగా ఈ జీవో లేదని చెప్పింది. అన్ని రాష్ట్రాలు ఆమోదించిన ఎన్‌ సి ఎఫ్‌ లోనీ 3.1.1 కి అనుగుణంగా ఈ జీవో లేదని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ శ్రీ బి.కృష్ణమోహన్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌ 1968 ను కూదా ఉదాహరించారు. ప్రాథమిక స్థాయిలో విద్య ప్రాంతీయ భాషలలోనే ఉండాలని అది వారి సాంస్కృతిక అభివృద్దికి అవసరమని 48లో ఎన్‌ పి ఈ 1968 తెలిపింది. దాక్టర్‌ కె కస్తూరిరంగన్‌ ఆధ్వర్యంలో రూపొందిన ఎన్‌ ఈ పి 2019 కూడా ఆయా రాష్ట్రాలు మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని సిఫారసు చేసింది.

ఇటువంటి వాదనలన్నీ విన్న తర్వాత తీర్చు ఇవ్వబోయే ముందు కోర్టు ప్రధానంగా ఐదు ప్రశ్నలు లేవనెత్తింది 1. స్వాతంత్ర్యానికి ముందు ప్రాథమిక విద్య బోథనా మాధ్యమం పరిస్థితి ఎలా ఉంది ల స్వాతంత్రానికి ముందు గానీ తర్వాత గానీ ప్రవుఖులు విద్యావేత్తలు మేధావులు దీనీపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు? ౩ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రాథమిక విద్యారంగంలో జోధనా మాధ్యమం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? 4 రాజ్యాంగ పరంగా చట్టపరంగా దీనికున్న నిబంధనలు ఏమిటి? విద్యా హక్కు చట్టం ఏం చెబుతోంది? ఇతర కేంద్ర రాష్ట్ర చట్టాలు శాసనాలు ఏమి చెబుతున్నాయి? 5 ప్రాథమిక విద్య ఆంగ్ల భాషలో ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 20 11 2019 న విడుదల చేసిన 85 వ నెంబర్‌ జీవో చారిత్రక నేపథ్యానికి, విద్వారంగ చట్టాలకు, కేంద్ర ప్రభుత్వ శాసనాలకు అనుకూలంగా ఉందా లేదా? ఈ ఐదు ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలు చెప్పి పూర్వాపరాలు సమీక్షించి అప్పుడు కోర్టు తన తీర్పును వెలువరించింది. పై ఐదు ప్రశ్నలకు హైకోర్టు ఎలాంటి వివరణ ఇచ్చిందీ చూద్దాం.

స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో ప్రాథమిక విద్య- బోధన మాధ్యమం

వ్యాపారం చేసి లాభాలు సంపాదించడం కోసం భారతదేశం లో అడుగు పెట్టిన బ్రిటిష్‌ వారు అంతకుముందు ఉన్న విద్యా విధానాలను, పద్దతులను రద్యుచేని మీవనదీ పాఠశాలలు ప్రవేశపెట్టారు. మధ్య, ఎగువ మధ్య తరగతిలోని కొంత మందిని ప్రభుత్వానికి (ప్రజలకు మథ్య అనుసంధాన కర్తలుగా చేయడమే వీరి చదువు లక్ష్యం. “వాళ్లు భారతీయులై ఉండి గుణాలలో బ్రిటిష్‌ వారిగా ఉండాలి”. అదీ వారి ధ్యేయం. దీన్ని డౌన్‌వార్డు ఫిల్దరేషన్‌

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ ఇలై-2020 |

సిద్ధాంతం అనీ అంటారు. దీన్ని అమలు చేయదానికి 1813 చట్టం, లార్డ్‌ మెకాలే విద్య విధానం, 1835 హంటర్‌ కమిషన్‌ మొదలైనవి వచ్చాయి

బ్రిటిష్‌ విద్యావిధానం భారతదేశంలో గుమాస్తాలను తయారు చేయడానికి పనికి వచ్చింది అన్నది సుస్పష్టం. అందుకే వారు ఆంగ్ల మాధ్యమం ఉండాలన్న విషయాన్ని బలపరిచారు.

స్వతంత్ర సోరాట దశలో భారతీయ మేధావులు (జ్యోతిరావు పూలే , బాలగంగాధర్‌ తిలక్‌) ప్రారంభించిన పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రాథమిక విద్య స్థానిక భాషలోనే ఉండాలని, సెకండరీ విద్య ఆంగ్ల మాధ్యమంలో ఉతతాలస నిర్ధారించారు.

1911లో గోపాలకృష్ణ గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్దం వల్ల అది సాధ్యం కాలేదు. సహాయ నీరాకరణ ఉద్యమం తర్వాత స్థానిక భాషలో చదువు అన్న అంశం ఊపందుకుంది.

1919 నుండి 1982 ప్రాంతంలో మహాత్మా గాంధీ విదేశీ సంస్కృతిపై ఆధారపడ్డ ఆంగ్ల విద్యా విధానాన్ని వ్యతిలేకించారు. దీంట్లో దేశీయ సంస్కృతికి చోటు లేకుందా పోయిందని అన్నారు. విదేశీ మాధ్యమం అసలైన విద్య నేర్చుకోవడం అసాధ్యమన్నారు.

1921 తర్వాత మాధ్యమిక పాఠశాలలో మాతృభాష మాధ్యమంగా ఉండసాగింది. 1937 నాటికి ఉన్నత పాఠశాలలో కూడా ఈ విధానం అమలు అయినది. 1937లో ప్రాథమిక విద్య కోసం రూపొందించిన విద్యా విధానం మార్గదర్శిగా నిలిచింది. ?- 11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు నిర్బంధ (ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని ఇది ప్రతిపాదించింది.

1945లో నయీ తాలిమ్‌ విద్వా విధానం 14 ఏళ్లలోపు పిల్లలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.

స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత మాతృభాషలో విద్యాబోధనం పై ప్రముఖుల అభిప్రాయాలు

1 పాఠశాలలో ఆయా మాతృభాషల్లోనే విద్యాబోధన కొనసాగాలని ఆనాటి ప్రసిద్ధ మేధావులు అభిప్రాయపడ్డారు.

“= భాషలన్నీ ఉదాత్త ఆలోచనలను వ్యక్తీకరించడానికి సమర్థమైనవే అయినా ఎవరి మాతృభాషలో వారు ఆ భావాన్ని ఇంకా బాగా _ వ్యక్తీకరించగలరు. మాతృభాషలో పరిచయం చేసిన భావనలను మిగతా భాషలలో పరిచయం చేసిన దానికన్నా తొందరగా (గ్రహిస్తారు. శరీరానికి రక్తము ఎలాంటిదో మాతృభాష మెదడుకు అలాంటిది. అందువల్ల పిల్లలకు మాతృభాషలో బోధిస్తే మెరుగైన థలితాలు వస్తాయి. నేర్చుకోవడం, భాష అనేవి పరన్పరం సన్నిహితమైన అంశాలు అనీ చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఎవరి ఖాషలో వారికి బోధిస్తే వతి మనిషి జ్ఞానాన్ని (గహించగలుగుతారు.

మహాత్మా గాంధీ ఆంగ్ల భాష మన హృదయాలలో ఆత్మీయమైన స్థానాన్ని ఆక్రమించుకుందని అన్నారు. మన తల్లిని మనం ప్రేమించినంతగా మన భాషనీ (ప్రేమించ లేకపోతున్నామనీ అన్నారు. తల్లిపాలు తాగినంత సహజంగా - ఎన్ని లోపాలు ఉన్నా నేనునా మాతృభాష షకు అతుక్కొనీఫోయి ఉంటాను. ఆమరణ పర్యంతం మాతృభాష ఒకటే తల్లి పాలలాగ నా అవసరాలను తీర్చగలదు.