ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాసాలు అవుతుంది. హేమంత బుతువు గడచి పోయింది. ఉదాయిస్థవిరుడు వచ్చి ఏడెనిమిది రోజులయ్యింది. ఫాల్గుణ పౌర్ణమాసి రోజున కాలుదాయి స్థవిరుడు ఆలోచనలో పడ్డాడు. “హేమంతం వెళ్ళి వసంతం వచ్చింది. రైతులూ మనుషులూ పైరులను కోసి త్రోవలను బాగుచేశారు. భూమంతా పచ్చని పచ్చిక పరచుకొని ఉంది. వనఖండాలన్నీ పుప్పించాయి. రహదారులు ప్రయాణానికి అనుకూల మయ్యాయి. బుద్దుడు తన జూతినీ ఉద్ధరించదగిన సమయం యిది.” ఇలా ఆలోచించిన ఆయన భగవానుని దరి చేరాడు.

“భంతే! ఫలాకాంక్షతో వృక్షాలు ఆకులను విడిచి అగ్నికణాలను ధరించి నట్లున్నాయి.

మవాోవీరా! అవి అగ్నిశిఖలలా అగుపడుతున్నాయి... ఇది రసాల కాలం.

“మరీ చలి లేదు. మరీ వేడి లేదు. అన్నానికి బాధ లేదు. భూమి పచ్చదనంతో శోఖిస్తుంది.

మహామునీ! ఇదే ప్రయాణించేందుకు తగిన సమయం.” అంటూ అరబై గాథలతో బుద్దుని ముందు కులనగర గమనాన్ని ప్రశంసించాడు.

“ఉదాయీ! ఇలా మధుర స్వరంతో యాత్రను గురించి ప్రశంసించిన కారణమేమిటో!” అన్నాడు బుద్దుడు.

“భంతే! మీ తండ్రి శుద్దోదన మహారాజు మిమ్మల్ని చూడాలనుకొంటున్నాడు. (స్వ్ప్రజాతివారిని ఉద్దరించాలి”.

“ఉదాయీ! నేనలాగే జూతివారిని ఉద్దరిస్తాను. నువ్వు యాత్రకు అవసరమైన కర్మలను పూర్తి చేయమని భిక్షు సంఘానికి తెలియజేయి.”

“మంచిది భంతే” అని ఆయన ఆ సంగతిని ఖిక్షుసంఘానికి తెలియజేశాడు. భగవానుడు అంగ-మగథధలకు చెందిన కులపుత్రులు పదివేలమంది, కపిలవస్థు నివాసులు పదివేలమందితో బాటుగా రాజగ్భహాన్ని వీడాడు. రోజుకు యోజనం చొప్పున నడువ సాగాడు. రాజగ్భహంనుండీ అరవై యోజనాల దూరంగల కపిల వస్తును రెండు మాసాల్లో చేరే ఉద్దేశ్యంతో నడకను మెల్లగా సాగించాడు.

ఈలోగా, శాక్యులు భగవానుడు విహరించవలసిన చోటును గురించి ఆలోచన చేసారు. న్యగోధుడనే శాక్యుని ఆరామం రమణీయమని ఎరిగి దానిని శుభం చేయించారు. గంధపుష్పాలను చేతికిచ్చి, చక్కగా అలంకృతులైన బాలబాలికలను ముందుగా ఆహ్వానానికై పంపారు. ఆ వెంటనే కుమారులనూ, కుమార్తెలనూ పంపి ఆ తరువాత తామే స్వయంగా గంధపుప్పు చూర్చాదులతో భగవానుని పూజిస్తూ న్యగోధారామానికి కొనిపోయారు. అక్కడ క్షీణాస్రవులైన ఇరవై వేల మంది అర్హంతులతో బాటుగా భగవానుడు అమర్చివున్న బుద్దాసనంపై ఆసీనుడయ్యాడు.

మరునాడు భగవానుడు భిక్షువుల సహితంగా భిక్లాటనకై కపిలవస్తును ప్రవేశించి. ఇంద్రఖీలంవద్ద నిలబడి ఆలోచించ సాగాడు- “ముందటి బుద్దులు - కులనగరంలో ఖిక్షాటనమెలా చేశారు? మధ్యలో కొన్ని ఇళ్ళను విడుస్తూనా, లేక ఒకదాని తరువాతొకటిగా ప్రతి ఇంటికీ వెళుతూనా?” కనీసం ఒక బుద్దుడైనా మధ్యన కొన్ని ఇళ్ళను విడిచి ఖిక్షకై చరించటం కానరాలేదు. “నాదీ బుద్దుల వంశమే కనుక నేనీ కుల ధర్మాన్నే గ్రహించాలి. దీనివల్ల రానున్న కాలంలో నా శ్రావకులు నన్నే అనుసరిస్తూ భిక్షాటన వ్రతాన్ని పూర్తి చేయగలరు.” అనుకొని మొదటి ఇంటినుండే ఖిక్షాటనను ప్రారంభించాడు. “ఆర్య సిద్దార్థకుమారుడు భిక్షాటనం చేస్తున్నాడ”ని విన్న ప్రజలు రెండు, మూడంతస్థుల మేడల పైనుండీ కిటికీలను తెరచి క్రిందికి చూస్తున్నారు.

రాహులమాతాదేవి (యశోధర) కూడా దీనిని విన్నది. “అర్య పుత్రుడీ నగరంలోనే ఎంతో రాజఠీవితో బంగారు పల్లకీలల్లో తిరిగాడు. కేశాలూ, గడ్డమూ తీసివేసి కాషాయాన్ని ధరించీ ఈ రోజునీ నగరంలోనే పాత్ర చేతపట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. ఇదేమైనా శోభనీయమాగో అంటూ కిటికీని తెరచింది. విరాగం వల్ల ఉజ్జ్వలమైన దేహకాంతితో నగరపథాన్ని ప్రకాశింపజేస్తూ అనుపమమైన సంబోధి సిరితో విరాజిల్లుతున్న భగవానుని చూసింది. రాజుతో “మహారాజా! మీ కొడుకు భిక్షాటనం చేస్తున్నాడు” అని చెప్పింది. రాజు కలవర బాటుతో లేచి, థోవతిని సరిచేసుకొంటూ వడిగా మేడమెట్లను దిగాడు. భగవానుని ముందు సిలబడి "భంతే! మమ్మెందుకిలా సిగ్గుకు గురిచేస్తున్నావు? భిక్షాటనెందుకు? మా వద్ద ఇందరు భిక్షువులకు భోజనమే దొరకదా!” అన్నాడు.

“మహారాజు! ఇది మా వంశాచారం.”

“భంతే! మనది మహాసమ్మత క్షత్రియ వంశం. ఒక్క క్షత్రియుడైనా ఎన్నడూ ఖిక్షాచారి కాలేదు”.

“మహారాజు! బాటసారులకు సత్రంలా నాకు క్షత్రీయవంశంతో ఉన్న సంబంధం తాత్కాలికం. బుద్దపురుషులే నా పూర్వ వంశీయులు. నా వంశాచారాన్నే నేను పాటించాలి.”

రాజు భగవానుని ఖిక్షాపాత్రను చేతిలోకి తీసుకుని ఆయనను భిక్షుసంఘ సహితంగా మేడ నెక్కించాడు. స్వహస్తాలతో ఖాదనీయ, భోజనీయాలను వడ్డన చేసాడు. భోజనం పూర్తయిన తరువాత ఒక్క రాహులమాత తక్క రాణివానపు స్రీలు అందరూ భగవానునికి వందనమాచరించారు. “వచ్చి ఆర్యపుత్రునికి అభివావం చేయ"మని పరిజనుని పంపి నప్పటికీ, “నాలో గుణముంటే ఆర్యపుత్రుదే స్వయంగా నాదగ్గరకు వస్తాదు. అప్పుడే నేను వందన మాచరిస్తాను” అని ఆమె రాలేదు.

పాత్రను రాజు చేతికిచ్చి భగవానుడు ఇరువురు అగ్రశ్రావకులతో బాటుగా రాకుమారి శయనాగారాన్ని ప్రవేశించాడు. “రాకుమారికి తోచినట్టుగా వందనమాచరించనిఅడి. ఏమనకండి.” అని వారికి చెప్పి పరచివున్న ఆసనం పైన కూర్చున్నాడు. ఆమె వడివడిగా వచ్చి ఆయన చీలమండలను పట్టుకుని, తలను పాదాలపై ఉంచి, తనకు తోచినట్లుగా వందన మాచరించింది. రాజప్పుడు ఆమెకు భగవానుని పట్లగల ప్రేమాభిమానాలను గురించి చెప్పసాగాడు- “భంతే! నా కూతురు నీ కాషాయ వస్త్రధారణను గురించి విన్నప్పటి నుండీ, తానూ కాషాయవస్త్రధారిణి అయ్యింది. ఒకసారే భుజించటం గురించి విని, తానూ ఏకాహారిణి అయ్యింది. - ఉన్నతమైన

36

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019