ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోయింది. తెలుగుభాషను తలకెత్తుకొని మోసి ఉద్దీపించిన మహాసామ్రాజ్యపు రాజధాని నగరం హంపి, కన్నడ వైభవానికి ప్రతీక అయిపోయింది. ఇంతకన్నా ఇంకేమి కోల్పోవాలి చెప్పండి.

సు : బళ్ళారిలో తెలుగుకు పూర్వవైభవం వస్తుందంటారా? సాధ్యమేనా?

జో: మనిషికి సాధ్యం కాని వని ఉందా? చిత్తశుద్దితో పూనుకోవాలి అంతే. తెలుగుబడులు పెరగాలి. ఒక పాఠ్యాంశంగా అయినా తెలుగును ప్రతి తెలుగువాడూ చదవాలి. తెలంగాణా ఆంధ్ర ప్రభుత్వాలు బళ్ళారి తెలుగువెలుగు కోసం నడుము కట్టుకోవాలి. కన్నడ ప్రభుత్వాలతో గట్టిగా మాట్లాడాలి. పాలమూరు, కర్నూలు, అనంతవురం జిల్లాలలో ఎన్నో కన్నడ బడులను మేము నడుపుతున్నాము, మీరెందుకు తెలుగుభాషను చిన్నచూవు చూస్తున్నారు అని నిలదీయాలి. తెలుగు మేధావులూ మీడియావారూ మా తెలుగు సమస్యలను ఎలుగెత్తి చాటాలి. తెలుగు ప్రభుత్వాలు ఏదాదికొక సాంస్కృతిక కార్యక్రమాన్ని బళ్ళారిలో జరపాలి. ఇటువంటి పనులు జరుగుతూ ఉంటే మరలా పూర్వ వైభవం వచ్చి తీరుతుంది.

సు: మీకు కృష్ణదేవరాయలు అంటే పిచ్చి అభిమానం. ఏటేటా రాయలవారి పేరిట సాహితీ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంటి గోడమీద నిలువెత్తు రాయలవారి బొమ్మను నిలుపుకొన్నారు. మీరే ఈ ప్రశ్నకు సరైన జవాబును ఇవ్వగలరు. చెప్పండి, రాయలవారు కన్నడిగుడా తుళువాడా?

జో : నూటికి నూరుపాళ్లు తెలుగువాడు. ఆంధ్రరాష్ట్రంలోని కొందరు పెద్దలు రాయలవారి మూలం గురించి మాట్లాడుతూ, ఆయన కన్నడిగుడో తౌలవుడో అయి ఉండాలని చెప్పడం ఆనవాయితీ అయింది. ఆయన పాలననూ సాహిత్యాన్నీ పొగుడుతూనే, “ఆయన తెలుగువాడు కాకపోయినా” అనే సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రులూ మంత్రులూ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకొన్న మహాపండితులూ కూడా ఇట్లాంటి అపోహను వెదజల్లుతూనే ఉన్నారు. రాయలవారి ఇంటి. పేరు 'సంపెట ' ఇది అచ్చమైన తెలుగు పదం. రాయలవారి ఆస్థానంలో ఎవరికీ దక్కనంత గౌరవం తెలుగు కవులకు దక్కింది. రాయల తెలుగు భాషాభిమానం జగమెరిగిన సత్యం. ఆయన తెలుగులో ఆముక్తమాల్యద కృతిని రాయడం, పెద్దనను గౌరవించి పల్లకి బోయిగా మారడం, ఆయన ప్రతినిధులుగా రాజ్యమంతటా తెలుగువారినే నియమించడం, ఆయన సామంతులూ వారసులూ తెలుగు సాహిత్యాన్నే అభిమానించి పోషించడం, వీటన్నిటిలోను రాయలవారి తెలుగుతనం గోచరిస్తుంది. ఇతర భాషీయుడు అనడానికి సాక్ష్యమే లేదు. స్నానసమయంలో తిక్మనభారతంలోని విదురనీతి, చాణుక్యనీతి మొదలైన తెలుగు పద్యాలను వినిపించుకొనేవాడనీ, యుద్ధ సమయాలలో కూడా సాయంకాలాలు కవులతో తెలుగు సాహిత్యగోప్టిలో పాల్గొనే వాడనీ తెలుస్తున్నది కదా! కొలువు కూటంలోనూ రెండు అంతఃవురాలలోనూ తెలుగే వినిపించేదనీ, ఒక అంతఃపురంలో మాత్రం కన్నడం ఎక్కువగా వినిపించేదని పోర్చుగీసు యాత్రికుడు డోన్‌ ఎరియస్‌ రాసినారంటే ఇంకా రాయలవారి మాతృభాష తెలుగే అనడానికి ఎందుకు సంకోచించాలి.

సు : మీ రచనల గురించి చెప్పండి. అట్లాగే వృత్తి ప్రవృత్తుల గురించి కూడా.

జో :శ్రీకృష్ణరాయము, వరమాల - జయమాల, రైతు రాయలు, సిరి సునీత అనే నాలుగు పద్యకావ్యాలూ శరణుడు బసవడు అనే వ్యాస సంపుటి నా స్వీయ రచనలు. ఇవి కాక తెలుగు నుండి కన్నడానికి ఆరు అనువాదాలూ కన్నడం నుండి తెలుగుకు పదిహేను అనువాదాలనూ చేసినాను. శ్రీకృష్ణ దేవరాయల వ్యక్తిత్వం గురించి ఇరవైకి పైగా, బసవతత్వం మీద పదిహేను వరకూ ప్రసంగాలూ పత్ర సమర్పణలూ చేసినాను. నటించడం నాకు ఇష్టమైన మరొక వ్యాపకం. పౌరాణిక, చారిత్రక పాత్రల ఏకపాత్రాఖినయాలలో పాల్గొన్న ప్రతిసారి (11సార్లు) మొదటి బహుమతిని అందుకొన్నాను. కన్నడ సాహిత్య నాటక అకాడెమీ వారి తెలుగు బసవన్న నాటకంలో బసవన్న పాత్రకు నటనా పురస్కారాన్ని అందుకొన్నాను. పేరు కలిగిన తెలుగు కన్నడ సంన్ధల వారి నుండి కొన్ని పురస్కారాలను అందుకొన్నాను. తెలుగు రాష్ట్రాలకు ఆవలి తెలుగు ప్రతిభావంతులకు ప్రతిభా పురస్కారాన్ని ప్రతి ఏటా మార్చి / ఏప్రిల్‌ నెలల్లో ఇస్తుంటాను. ఆగష్తు 7న శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక ఉత్సవాన్ని జరుపుతుంటాను. తెలుగు, కన్నడ, తమిళ, సంస్కృత భాషలలో రాయల గురించి కృషి చేసిన వారిని సత్మరిస్తుంటాను. ఇవన్నీ గుత్తి నారాయణరెడ్డి సాహితీ పీఠం తరపున చేస్తుంటాను. ఇక వృత్తి అంటారా, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివి, అనేక పరిశ్రమలలో ఇంజనీరుగా, జనరల్‌ మేనేజరుగా పనిచేసినాను.

సు: బళ్ళారి జిల్లా రచయితల సంఘం (ఐ.రసం.) ప్రారంభం అవుతున్న సందర్భంగా మీ స్పందనను తెలియచేయండి.

జో : చాలా నంతోషంగా ఉంది. ఈ విషయంగా స.వెం. రమేశ్‌ చాన్నాళ్లుగా నా వెంట పడుతూ వచ్చినాడు. ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చింది. చదువు అనేది తెలుగులో లేకపోతే తెలుగు నిలబడదు. చదువు అంటే ఊరికే అక్షరాలను నేర్చుకోవడం కాదు. కన్నదాన్నే చదివినవాళ్ళు కూడా కూడుకొని కూడుకొని తెలుగును చదివేస్తారు. సినిమాపోస్టర్ల మీదనో బస్సుల మీదనో ఉన్న నాలుగు అక్షరాలను చదివేయడం కాదు చదువంటే. తెలుగు నాగరికభాష, దీనికి వెయ్యేండ్లకు పైబడిన సాహితీ చరిత్ర ఉంది. దానిని చదవడం, అర్థం చేసుకోవడం, అనుభవించడం, సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఆధునికతను అందివుచ్చుకోవడం ఇదే నాగరిక సమాజపు చదువంటే. బళ్ళారిలో పద్యకావ్యాలను రాస్తున్న కవులు చాలామందే ఉన్నారు. కానీ కథ, నవల, వ్యాసం వంటి ఆధునిక సాహితీ ప్రక్రియలలో రచనలు చేస్తున్నవారు ఒకరిద్దరికంటే ఎక్కువమంది లేరు. బ.ర.సం. వారు తయారు చేసుకోవాలి. తమ ఉనికిని ఆధునిక ప్రక్రియలలో రచించి చాటే కొత్తతరం రచయితలను వెలికి తేవాలి. ఈ పనిని ఇవ్పటి తమిళనాటి తెలుగువారు మొదలు పెట్టి విజయవంతంగా చేస్తున్నారు. బళ్ళారిలో కూడా మొదలవుతుందని ఆశిద్దాం. సెలవు.

| తెలుగుజాతి పత్రిక అన్మునాది 6 మే 2019 |

26

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019