పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు



గవర్నరు ప్రతినిధినభ ఎన్నికలు జరుగగూడదని నిషేధించెను. కాని ప్రజలెన్నికలను మానలేదు. సభ్యులందరును నెన్ను కొనబడిరి. ప్రతినిధి సభ్యులు సమావేశ మైరి. గవర్నరు. సమావేశము నుపక్రమించలేదు, ప్రతినిధి సభ్యు లేకలసి రాష్ట్రీయమహాసభ యని పేరిడిరి.. రాష్ట్రీయ వ్యవహారములను చర్చించ సాగిరి. గవర్నరరు జనరలు గోజు 'మెసషు సెట్సు రాష్ట్రమునకు పాలకుడేగాక ఉత్రత. అమెరికాలోని యాంగ్లేయ సైన్యముల కన్నిటిని సర్వ సేనాధిపతియు గూడ నై యుండెను. ఈయన వెంటనే పన్నెండు వేల సైన్యము నాయత్తపరచెను. సైనికుల కాహారపదార్ధములను యద్ధడసామగ్రులను సమ కూర్చెను. ఇందుకు స్వతి రేకముగ ప్రజాప్రతినిధులు తమ రాష్ట్రములోను తోటి రాష్ట్రము లోను ఇరువది వేల బాతీయ సైనికులను తయారుచేసిరి - కెనడావారి సహాయమును గూడ కోరి. " రాష్ట్రీయ మహాసభ వారి యుత్తరువులను ప్రజలు శిరసా వహించు చున్నారని కు మెసషు సెట్సు రాష్ట్ర ములో న్యాయస్థానములు గాని శాస్త్రీయమైన శాసన:సభగాని లేవనియు అల్లకలోలమగు నున్నదనియు అనేక భాగములో ప్రజ లాయుధపాణులై ప్రభుత్వము మీద కలహించుటకు సిద్ధ ముగా నున్నారనియు " నీగవర్న రాంగ్ల ప్రభుత్వము వారికి వ్రాసుకొనెను.

{విలియంపిట్టు}

నవంబరు 30 వ తేదిన ఆంగ్లేయ పార్లమెంటు సమావేశమయ్యెను. అమెరికా వలస ప్రజలు తన కవిధేయతను చూపుచున్నారనియు ఆంగ్లేయ సభుత్వ ధిక్కారమును తాను సహించననియు రాజు తన