పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

అమెరికా సంయుక్త రాష్ట్రములు


వారును ఆంగ్లేయ రాజునకును, పార్లమెంటుకును అర్జీలను పంపిరి. బాస్టనులోని వర్తకులు తామింగ్లీషు సరుకులను తెప్పించమని యొడంబడిక చేసుకొనిరి. తక్కిన వర్తకుల నందరిని నయముననో భయముననో తమ యొడంబడికలో చేరునట్లు చేయుటకై యొక పలుకుబడిగల యుపసంఘమును నియమించిరి. స్వాతంత్ర్య దేవతకు పుత్రికలగు అమెరికన స్త్రీలు తేయాకు త్రాగుటను చూసుకొని. తేయాకు నింగ్లాండు నుండి తెప్పిం చుకొనవలసి యుండినందుననద్దానిని బహిష్కరించి తేయాకు నీరు, తాగటయే మాను కొనిరి. స్త్రీలను పురషులను ఇట్టి యేక భావము తోడను పట్టుదలతోడను పని చేసిన జాతి స్వాతం త్ర్యమ న కర్హము గాదా? అమెరికా వారు పరాసు దేశముతో వర్తక యొడంబడికలు చేసుకొని ఆంగ్లేయులకుమారుగా తాము స్వంతముగ వెటనే తయారు చేసుకొ లేసి వాటిని పరానుదేశము నుండి తెప్పించుటకు న్చియించుకొనిరి. ఇం దుకు పరాసుమంత్రి ఛాయిసులు మిగుల తోడ్పడెను.


స్పైన్ చేశము కు లోబడియుండిన లూసియానా వలసరాష్ట్రములోని పరాసు ప్రజలు స్పెయిన్ ప్రభుత్వముపై తిరగబడి ప్రజాస్వామ్యమును స్థాపించుటకు యత్నించిరి. కొంతకాలము వరకది స్పైన్ వారిని పశుబలము వలన నణచి వేయబడినప్పటికిని ఆయద్యమముకూడ నీ ఆంగ్లేయ వలసరాష్ట్రములకు మార్గదర్శకమయ్యెను.

తాను చెప్పిన ప్రకారము నడచుకొన లేదని బాస్టనులోని గవర్నరు బెర్నార్డు ప్రజాప్రతినిధిసభ ను విచ్చిన్నము చేసెను. తిరిగి మరియొక సభన సమావేశ పరచుటకు నిరాకరించెను.