పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సుయుక్త రాష్ట్రములు.

అయిదవ అధ్యాయము.

{ఓడ వర్తకమును గూర్చిన
శాసనములు/

స్వతంత్ర యుద్ధమునకు కారణములు.

ఉత్తర అమెరికా వలవ రాష్ట్రముల వారాంగ్లేయ దేశ మునందు భక్తిగలిగి యాంగ్లేయ దేశగౌరవమును సంరక్షించుటకును తమ ప్రదేశము లను విస్తరింప చేసికొనుటకును యుద్ధములు చేయుట కెప్పుడును సుసిద్ధులుగ నుండిరి. "కాని తమహక్కులకు భంగముకలుగ చేసినపు డాంగ్లేయరాజును ఆయిన ప్రతినిధుల ధిక్కరిం చుటకును నొకప్పుడు తిరుగ బాటులుచే యుటకును వెనుదీయకుండిరి. స్వాతంత్ర్య యుద్ధ మునకు పూర్వము చాలాకా లమునుండియు నిగ్లాండునకును వలస రాష్ట్రములకును కొన్ని కలతలు కలుగుచునే యుండెను. ఇంగ్లాండు ప్రభుత్వమువారు పదునేడవ శతాబ్దపు మధ్య బాగము నుండియు(నానిగేషణన్ ఆక్టులు) ఓడవర్త కమును గూర్చి చేసిన శాసననము వలన నీ వలస రాష్ట్రము - వారికి మిక్కిలి యసంతృప్తి కలిగినది. ఇగ్లండు ప్రభుత్వము వారు వలన