పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


హీనమయ్యెను. తుదకెవరో యొక తెల్లజాలివారికి జయము కలిగి యీజయము పొందిన తెల్లవారు తరువాత యధాప్రకార ము తమ చుట్టునున్న ఎర్రఇండియములను నాశనము చేసి వారి దేశము నాక్రమించిరి. "


కాని ఎర్రజాతుల విషయమున స్పైన్ నారు, ఫ్రెంచి వారు 'మొదలగు లాటిన్ తెల్లజాతులవారికిని ఇంగ్లాండు జర్మనీ మొదలగు ట్యూటానికు తెల్లజూతులవారికిని కొంత భేదము కలదు. స్పైన్ వారు మొదలగు లాటిన్ వారు సామాన్యముగ ఎర్రవారిని లోబర్చుకొని బానిసలుగ చేయుచువచ్చిరి. ఇంగ్లాండు, జర్మనీ మొదలగు ట్యూటానికు జాతుల వారు ఎర్ర యిండియనులను నాగరికతకు శత్రువులనియు నాగరికత నేర్పు టకువీలు లేని మోటవారసియు వీలయినంతతవరకు దొరకినవారి నెల్ల చంపుచు పచ్చిరి. మొదట స్పైన్ వారుకూడ పశ్చిమ యిండియా లంకలలోని కాపురస్తులనునరకి వేసి నాశము చేసి యున్న స్పటికినీ తువాత నాపద్దతిని మానివేసి వారిని బానిసలుగా చేయుచు పచ్చిరి. కావున యిప్పటికిని మధ్య దక్షిణ అమెరికాలలోని స్పెన్ వారి ఆధీసముసున్న దేశము లన్ని టీలోను చాలమంది ఎర్రయిండియను లున్నారని పందొమ్మిదవ శతాబ్దమున బానిసత్వపు శృంఖములు తెగిపోయి వీర లెల్ల వారితో కలసి పోవుచున్నారు. ఇట్లు కలవనిచోట్ల కూడ అమెరికాలోను మెక్సికోలోను నీయెర్ర జాతులు నవనాగరి కత నవలంబించి స్వతంత్రులగు పౌరులుగనున్నా రు. ఉత్తర అమెకాలోని కెనడా దేశపు కొన్ని ప్రాంతములలో వరాసులు మెర్రయిండియనులతో కలిసిపోవుటవలన మిశ్రమ