పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

అమెరికాసంయుక్త రాష్ట్రములు


ఒక చోటనుంచి మరియొక చోటునకు బోయి యిండియను జాతు లనందరను ఆంగ్లేయుల పై యుద్ధమునకు లేవదీసెను. మైన్ మొదలు కనెక్టికటువరి కున్న జాతులందరును ఆంగ్లేయుల పైకి లేచిరి. మొహగను జాతివారు మాత్రము వీరిలో చేరలేదు. ఒక సంవత్సరమువరకు యుద్దము భయంకరమగ జరిగెను. ఆంగ్లేయు లయొక్క పన్నిండు పదమూడు పట్టణములు నాశనము చేయబడెను. ఆరువందల గృహములు తగుల పెట్టబడెను. ఆంగ్లేయులలో ఇరువదవవంతు చంపబడిరి. కాని తుదకు ఎర్రయిండియను లోడిపోయిరి. నర్రిగను సెటి జాతివారు నాశనము చేయబడిరి. కొన్ని జాతుల వారు తమ ప్రదేశములను ఆంగ్లేయులకు వదలి పారిపోయిరి. ఫిలిపుయొక్క భార్యా పిల్లలు. ఆంగ్లేయులకు చిక్కిరి ఫిలిపును వెంబండించి కాల్చిచంపిరి. అతనిశిరమును ఖండించి ఆంగ్లేయ వలసరాజ్యమంత లోను త్రిప్పి ప్రదర్శించిరి. అతని కుమారుని బానిసగ విక్రయించి, ప్రప్రధమమున ఆంగ్లేయ యాత్రికులతో స్నేహము చేసిన మెనపోయిటు రాజవంశ మీ విధమున 1676 వ సంవ త్సరములో సంతరించెను.


(10)

{ప్రజాప్రతినిది సభలు

ఈపదమూదు వలన రాష్ట్రములును ఆంగ్లేయ రాజునకు లోబడి యుండెను. ఆంగ్లేయ రాజుల యనుమతితో పజా ప్రతినిధి సభలను స్థాపించు కొనెను. ఆంగ్లేయ రాజులు గవర్నరులను నియమించిరి . వీటి కుత్తరమునసున్న కనడా దేశము , ఫెంచి రాజులకు లోబడి యుండెను. యూరపుఖండమున తరుచుగా ఆంగ్లేయులకును