పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


యిండియనుల కమ్ముచువచ్చిరి. మంచి మంచి మృగముల చర్మము లెర్ర యిండియునులు తెచ్చి యిచ్చుచుండిరి. వీటి నాంగ్లేయు లింగ్లాండునకు రవానా చేయుచుండిరి. ఇంచు వలన యెరయిండియనులు వ్యవసాయముమాని, వేటాడి తోళ్ళ నాంగ్లేయులకిచ్చి వీరినుండి ధాన్యమును తీసుకొనిపోవు చుండిరి. ఎయిండియనుల స్థితి క్షీణించెను. ప్రధమమున న్యూ ఇంగ్లాండును స్థాపించిన ఆంగ్లేయులను “పిలిగ్రింఫాదర్సు” (యాత్రికులని) పిలుచుచుండిరి.

{మినిషుసెట్సు}

1628 సంవత్సరమున మనషుసెట్సు వలస కొందతాం గ్లేయులచే స్థాపింపబడెన'. నేలము పట్టణము ప్రధమమున ముఖ్య స్థానముగ సుండెను. తరువాత బాస్టన్ పట్టణము వృద్దియయ్యెను. 1635 సంవత్సర మున మూడు వేలమంది కొత్త వారు వచ్చి చేరిరి.

{కనెక్టికటు}

మెసషు సెట్సు ప్రాంతము నుండి కొందరు పోయి కనెక్టి కటు ప్రాంతమున వలస స్థాపించు కొనిరి. ఆప్రాంతము "పికెడ”ను ఎర్రయిండియమజాతివారిది.వారాంగ్లేయులయందు ద్వేషభాషను జూపిరి. ఒక ఎరయిండియను ప్రభువు నాంగ్లేయు లెత్తుకొని వచ్చి చంపిరి, ఇద్దరాగ్లేయులను ఎర్రయిండియనులు చంపిరి. మెసషు సెట్సు ప్రాంతములనుండి ఆంగ్లేయులువచ్చి ఎర్రయిండియ నుల గ్రామముల తగుల బెట్టి సస్యములను పొడుచేసి వెళ్ళిరి, కనెక్టికటు వలసవారు కూడ పికెడుజాతి వారిమీద యుద్ధము నకు బయలు వెడలిరి. పికెడు జాతికి విరోధులగు మొహగను లను ఎర్రయిండియను జాతివారి సహాయము సొంగ్లేయులు