పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సెప్టెంబరు 6వ తేదీన “మేప్లవర"ను నా పడవలో నూట యిద్దరాంగ్లేయులు అమెరికాకు ప్రయాణము చేసిరి. వారు హడ్సనునది ప్రాంతమున నివసించ నుద్దేశించిరి. కాని అరువది. ఏడురోజులు ప్రయాణము చేసి - కేపుకాడు వద్దదిగిరి. నౌకలో నుండగానే నీదిగువవిధమున నేర్పాటుచేసికొనిరి. "భగవంతుని నమ్ముఖమున మనకు తెలియచేయునదేమనగా, ఈదిగువ నామోదుచేసిన 'పేర్లుగల జేమ్సురా జుయొక్క ప్రజలమైన మనము, భగవంతుని ఘనపర్చుటకును క్రైస్తవమతము నభివృద్ధి చేయు టకును మనరాజు యొక్కయు దేశముయొక్కయు గౌరవము నిమిత్తమును పరమేశ్వరుని యనుగ్రహము వలన వర్జీనియాలోని యుత్తర ప్రాంతము లలో మొదటి పలస నేర్పరచుట కుద్దేశించి యున్నాము. కాన మన అందరి యెదుటను భగవంతుని సమ్ముల మునను మన క్షేమమునిమిత్తమును మనయుదేశ్యములను నెర వేర్చుకొను నిమిత్తమును మనమొక పాలనా సంఘముగ నేర్ప డినారము. మన వలస యొక్క లాభమునిమిత్తము న్యాయ మైనట్టియు యుక్తమైనట్టియు చట్టములను మనము చేసికొనిదము. వాటికి మసము విధేయులమై ప్రవర్తింతము. దీని కొప్పుకొని 1620వ సంవత్సరము నవంబరు 11 వతేదిన మన మందరము సంతకములు చేయడమైనది" స్వేచ్ఛగలమానవులు స్వేచ్చగా తాము చేసికొనెడి శాసనములకు బద్దులై నడచుకొసుటయే యుత్తమమగురాజనీతి. దీనిని ఈ అమెరికెను వలస ప్రజ లనుకరించిరి. వారాచుట్టుపట్ల ప్రదేశములను చూచి డిసెంబరు 11 తేదీన న్యూఇంగ్లాండును స్థాపించిరి. ఆశీతాశాలము దుర్భరమగుటచే చాలమంది మరణించిరి. - . I