పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాంగ్లేయులును డచ్చి వారును (హాలండువారు), కొంతమంది. స్వీడనువారును నివసించుచున్నారు. . (7)

{న్యూజర్సీ}

(8) 1664 సంవత్సరమున నాంగ్లేయులు (న్యూయార్కు)న్యూ నెదర్లాండు) పై దండెత్తి కొంత భాగము.నాక్రమించిరి. దీనికి న్యూజర్సీయని పేరిడిరి. దీనిలోను నాంగ్లేయులున డచ్చి వారును గాపురమున్నారు.

{పెనిసిల్వేనియా
డెంవేరు
రాష్ట్రములు}

ప్రధమమున నిచట డచ్చివారును స్వీడను వారును స్థావగ మేర్పచుకొనిరి, 1682 సంవత్సరమున క్వేకరు మతస్థుల నాయకుడు విలియం పెన్న సునాయన రెండవచార్లెసు రాజునుండి ఈ ప్రదేశమును దానపట్టాను పొందెను. తానును కొంతమంది కేంకరు క్రైస్తవశాఖకు చెందిన యాంగ్లేయులును వెళ్ళి యచట నివాసము నేర్పరచుకొనిరి. సోద ప్రేమ " యను పేరుగల ఫిలడల్ ఫియా పట్టణమును స్థాపించిరి. ఈపట్టణ మతిత్వరితముగా వృద్ధి చెందెను. విలియం పెన్ను చాలయోగ్యుడు. ఇక్కడ మతసహనమును సోదరభావమును సంపూర్ణముగా స్థాపించెను. ఈయన యెర్రయం డియనులతో నొడంబడికలు చేసి ఎప్పటికిని వాటికి వ్యతిరేక ముగా ప్రవర్తించలేదు. ఎంయిండియనులతో యుద్ధములు లేకుండ' కాలముగడపెను. 1684వ సంవత్సరము న ఆగ్లేంయ దేశమున కేగిన తరువాత నీయన చేసిన యేర్పాటులు నిలువ లేదు. జర్మనీ నుండి చాలమంది మంచివ్వవసాయకులు వచ్చి 'పెనిసిల్వేనియా రాష్ట్రము న వలసచేరిరి,