పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/43

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

అమెరికా నుంయుక్త రాష్ట్రములు


కొనుచుండిరి. వర్తకులు వేసవికాలములోనుండుటకు కొన్ని చిన్న యిండ్లను నిర్మించిరి. తరువాత నివి 'చలికాలము వరకు సుంచబడెను. ఆ పైన ఒక చిన్న కోటనుకట్టిరి. తరువాత ఆల్బ. నీయసు ప్రదేశమున 1615 వ సంవత్సరమున హాలండువారు కొంతమంది కాపురము నకు వచ్చిరి. క్రమక్రమముగ హాలండు నుండి కొత్త వారు వచ్చి చేరిరి. 1623 వరకు డెల వేరుసముద్రమునుండి కాడు కేవు వరకును సముద్రతీరముననున్న ప్రదేశ మంతయు నా క్రమించి న్యూ నెదర్లాండ్సను పేరు పెట్టిరి. ఇపుడు న్యూయార్కు పట్టణమున్న ప్రదేశమున న్యూ అంస్టర్డం పట్టణ మువృద్ధియగు చుండెను. మనహట్టనులంకను, హాలండువారు 1625 వ సంవత్సరమున ఎర్రయిండియనుల నుండి ఇరువది అయిదు డాలర్లకు కొనిరి. ఏబదిమంది తెల్ల వారిని వలస దెచ్చుట కొడంబడిన ప్రతి (హాలండు) డచ్చి భూకామందు నకును పద నారు మైళ్ళ పొడవుగల ప్రదేశము నిచ్చిది. ప్రధమమున పక్కనున్న వర్జీనియా మొదలగు నాంగ్లేయ వలస రాష్ట్రములతో స్నేహముగనే యుండిరి. కొంత కాలమునకు ఎర్ర యిండియనులతో పోరాటములు ప్రారంభ మయ్యెను. తరువాతి నాంగ్లేయుల తోను, స్వీడను వారితోను కలతలు గలిగెను. కానిరాజీపడిరి. హాలండువారికిని ఆంగ్లేయులకును యూరపు ఖం డమున యుద్ధములు జరిగి 1674 సంవత్సరమున జరిగిన సంది వలన నీన్యూ నెదర్లాండ్సు రాష్ట్రమాంగ్లేయ పాలన ము క్రింద చేర్పబడెను. అప్పటి గండియు దీనికి న్యూ యార్కు రాష్ట్రమనియు ముఖ్య పట్టణమగు న్యూఆంస్టర్థం పట్టణముసకు న్యూయార్కు పట్టణమనియు పేరు పెట్టిరి. దీనిలో