పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

అమెరికా సంయుక్త రాష్ట్రములు


సభుత్వమువారు జోక్యము పుచ్చుకొనగూడదనియు నాశాసవమును గూడ వీరు ప్రత్యేకముగ చేసికొనిరి. వర్జీనియా రాష్ట్రము నుండియు నిచటికి తెల్లవారువచ్చి నివాసమేర్పరచు కొనిరి. 1683 సువత్సరమున కొందరు పరాసువాగును 1711 వ సంవత్సరమున కొందరు జర్మనువారును కాపురమునకు సచ్చి చేరిరి. ఎర్రయిండియనుల భూములను తెల్లవా రాక్రమించుటవలన ఎర్రయిండియసులతో యుద్దములు జరిగెను. ఎర్ర్యిండియను లోడిపోయి చాపగ మిగిలినవారు మరియొక ప్రాంతమునకు పారిపోయిరి. .


(5)

{జార్జియా}

ఇది ఆఖరువ స్థాపించబడిన రాష్ట్రము . 1712 జయా సంవత్సరమున బగిలుదోర్పను నాంగ్లేయుడు రెండవ జార్జి రాజునుండి దానపట్టాను పొంది నూటయిరువది మంది యాంగ్లేయులను వలసకు తెచ్చెను. దీనికి శవన్నా ముఖ్య పట్టణముగ నిర్మించిరి. ఈ రాష్ట్రమునకు బానిసలను తేననియు కల్లు సారాయి మొదలగు మత్తు పదార్దముల నిచటికి రానివ్వ సనియు బగిలుదోర్సు ఒడంబడిక చేసెను. జర్మనీనుండి కొందఱు మొరేలియను క్రైస్త వమత శాఖకు చెందిన జర్మనులును స్కొట్లండు నుండి స్కాచివారును కూడ తరువాత వలసవచ్చిరి. 1748 సంవత్సరమున బిలిటోర్పు అమెరికాను వదిలిపోయెను. ఆయన వెళ్ళగనే రాష్ట్రమున కల్లు సారాయిదుకాణము రేర్పడెను. బానిసత్వము విరివిగా సాగెను. ఇచటతోటలలో పనిచేయుట. ఆఫ్రికా బానిసలను విశేషముగ తెచ్చిరి. ఈ సందర్భమున నొక ప్రశ్న పుట్టవచ్చును. ఆంగ్లేయరాజు ఎర్ర