పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

అమెరికాసయక్త రాష్ట్రములు



ఫౌండ్లాం సుద్వీపమును పశ్చిమయిండి యాద్వీపములలోని కొన్ని పెద్దద్వీపములును, దక్షిణ అమెరికాలో బిటిషు గ్వైనాయును కొన్ని యితరద్వీపములును కూడగలవు. . కనడా దేశమునకు దక్షిణముననున్న ప్రదేశమును, ముఖ్యముగ నాంగ్లేయు లాక్రమించి చాలకాల మాంగ్లేయందేశపు పౌలనముక్రిం ద నుండిరి, తరువాత నాంగ్లేయదేశముతో కలహించి అమెరికా సంయు క్త రాష్ట్రములను పేరున స్వతంత్ర మును పొందిరి. వీరిచరిత్రమే మనమిపుడు చదువుచున్నాము. ఈ ఆంగ్లేయవలస రాష్ట్రములు స్వతంత్రముకొరకు యుద్దము చేసిన నాటికి పదమూడు రాష్ట్రములుమాతమే యుండెను. వాటి నిగూర్చి సంగ్రహముగ రాబోవు అధ్యాయము నందు వివరించెదము.