పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఆమెరికాసంయుక్త రాష్ట్రము


ఘోరయుద్దములు జరిగెను. సముద్రములమీదను భూమి “మీదను వీరిమధ్య ననేకదోపిళ్లుహత్యలు జరిగెను. వీరి మధ్యధర్మ నిర్ణయము చేయుటకు పశుబలము తప్ప వేరు సాధనము లేదయ్యె. బలవంతులు లాభమును పొందుటయు బలహీనులు క్షీణించు టయు జరిగినది.

{యూరోపియను
జాతుల రాజ్య
సంపాదన

రోములో కూర్చుండి ప్రపంచము నంతను స్పైయిన్, వారిని పోర్చుగీసు గారికిని నొకకాగితముమీద గీతగీయుటతో పంచియిచ్చిన ప్రధాన క్రైస్తవ పాదనము, మతాచార్యుని పంపిణీని తక్కిన జాతులవారు గౌరవించ లేదు. ఆంగ్లేయులును, డచ్చి వారును, స్వీడను వారును, తాము పొటెస్టంటులమని చెప్పి 'పోపును ధిక్కరించిరి. రోమను కాథలిక్కు మతాచార్యుని (పోపు) శిష్యుడగు పరాసురాజుకూడ తనగురువు చేసిన పంపక మును తిరస్కరించి పోరాడి చేతనయినంత సంపాదించుకొనుట కతని మనస్సాక్షి బాధ పెట్టలేదు. ఎర్రయిండియముల దేశములలో నిష్కారణముగను వారియనుమతి లేకుండగను ప్రవేశించి యాక్రమించుకొనుటకును వారిని నాశనము చేయుటకును బానిసలుగ చేయుటకును తెల్లజాతులవారి మనస్సాక్షిఅనలే బాధ పెట్టలేదు. కాని అమెరికాలో అందరును నమా నముగ సంపాదించలేదు. స్పెర్, పోర్చుగీసు దేశముల వారిదివరకే మధ్య అమెరికాను దక్షిణ అమెరికాను కొన్ని పశ్చిమ యిండియా ద్వీపములను సంపాదించుట చూచియుంటిమి. డేసులు ( డెన్మార్కు వారు ), కొన్ని పశ్చిమయిండియా ద్వీపములను మాత్రము సంపాదిం దిరి. స్వీడను వారికేమియు