పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/309

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు



విదేశీయ
వ్యవహారములు.


సంయుక్త రాష్ట్రములు చాలా పెద్ద దేశమగుటచే వ్యవసాయము గనులు పరిశ్రమలు మొదల గునవి అభివృద్ధి చెందుటకును దేశముయొక్క ఆర్థిక సంపదను పెంపొంద చేయుటకును ఇంక నెంతయో అవకాశము గలదు. జనులాక్రమించుకొనదగిన ప్రదేశ మొంతయో గలదు. కావున సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వమువారు ఖండాంతరములలో రాజ్యవ్యాపకము చేసుకొనుటకు ప్రయత్నించుట లేదు. తమ దేశమును బాగు చేసుకొనుటలోనే తమ ప్రభుత్వము యొక్క, యావచ్చక్తిని వినియోగించవలేననియు రాజ్యసంపాదస కొద్దిమంది భాగ్య వంతులకు మాత్రమే లాభదాయకమై జనసామాన్యమునకు నష్టకరమనియు తలచు కక్షి వారి ప్రాబల్యము ఆ దేశముదు విశేషముగా గలదు. అమెరికాఖండములో యూరపు ప్రభు శ్వముల వారు జోక్యము కలుగ జేసుకొనగూడదనియు క్రొత్త రాజ్యములను స్థాపించగూడ దనియు అమెరి” ఖడములోని పతి దేశ ప్రజలుసు తెమ యిచ్చవచ్చిన ప్రభుత్వమును స్థాపిం చుకొనుటకు సంపూర్ణమగు అవకాశ ముండవలెననియు యూరవు ప్రభుత్వముల వారు అమెరికాఖండములోని ఏదేశ ముతో జోక్యము పుచ్చుకున్నను తాము దానిని ప్రతిఘటిం తుమనియు 1828 వ సంవత్సరమున సంయుక్త రాష్ట్రముల అధ్యక్షుడగు మన్రో ప్రకటించెను. తదాది యూరపు ప్రత్వముల, కుట్రలోను ' తగాదాలలోను యుద్ధములలోను సంయుక్తరాష్ట్రముల ప్రభుత్వము వారు జోక్యము పుచ్చుకొన కుండుటయే రాజనీతిగా పెట్టుకొనినారు. అమెరికాఖండము