పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/306

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

285

పది మూడవ అధ్యాయము


కును పడలేక వలస పచ్చెడి ధీరులివుడు వచ్చుటలేదు. పటట బీదలగుగారు స్త్రీలు పురుషులు పిల్లలు వచ్చుచున్నారు. ఈ వచ్చు వారు స్వేచ్చగా అమెరికాలో ద్రవ్యార్జన చేసికొనుటకై వచ్చుచున్నారు. సాంఘికాచారములు పూర్వ సొంప్ర దాయములు మొదలగు ప్రాత బంధములను పూర్తిగా తెంచి వచ్చునట్టియు స్వతంత్రమనే పూర్తిగా కోరునట్టియు జనులే విశేషముగా అమెరికాకు చేరుచున్నారు.


అమె కాదేశములో పాశ్చాత్య నాగరికత మూర్తీభ వించినదని చెప్పదగియున్నది. ప్రజలు క్రైస్తవ మతము నవలంబించుచున్నప్పటికిని అమెరికా ఆధ్యాత్మిక దేశముగాదు. దవ్య సంపాదనము, రాజకీయ వ్యవహారములు, ఐహిక సౌఖ్యములు వీటియుచు ప్రజలు నిమగ్నులై యున్నారు. హిందూ దేశము లోపలె నచట గొప్ప దేవాలయములు, మసీమలు, పుణ్య క్షేత్రలులేవు. పవిత్రనదులు, యాత్రా స్తలములు తపో వనములు ఆశ్రమములు లేవు. సన్యాసులు, భిక్షువులు, పకీర్లు, "బై రాగులు అచట లేరు. కాని అచ్చట (Organised Socian Service) మంచి ఏర్పాట్ల మీద జరుగుచున్న సాంఘిక సేవలో తమ జీవితమును గడుపుచున్న స్త్రీలు పురుషులు పిల్లలు వేలకు వేలులరు. వీరు విద్యాభివృద్ధి, రోగుల చికిత్స,దీనులపోషణముమొదలగు సొంఘిక సేవయందు పనిచేయుచున్నారు. అమెరికాకు స్వతంత్రము ఐశ్వర్యముగలదు. ఆధ్యాత్మిక జ్ఞానము కావలెను. హిందూదేశమునకు ఆధ్యాత్మిక జ్ఞానము గలదు. స్వతంత్రము ఐశ్వర్యము కావలసియున్నవి.