పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/299

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


ముగ తీవ్రమైన పత్రికా ప్రచారము చేసిరి. కరపత్రములను విరివిగా పంచి పెట్టిరి వారు తెలియపరచిన ముఖ్య హేతువు లేమనగా, "అమెరికాలోని ఐచ్ఛిక భటులు ఆంగ్లేయ సైన్య ముల ముందర నిలుపజాలరు. అమెరికాకు స్వతంత్రము పచ్చునను మాట వట్టికల్ల. ఒక వేళ నిజముగా అమెరికాకు స్వతంత్రమే వచ్చినచో, ఆమెరికాకు అంతకన్న ఎక్కువ దురదృష్టముండబోదు. ఆంగ్లేయులు దేశమును విడిచి పోగానే అమెరికాలో అంతః కలహములు కలిగి ఒక కక్షివారు మరియు కక్షివారిని, ఒక రాష్ట్రమువారు రియొక రాష్ట్రము వారిని సరకుకొని దేశమును రక్త ప్రవాహములో ముంచెదరు. ఇది నిశ్చయము. స్వతంత్ర మని ఆర్భాటము చేయుచున్న దుండగీడుల మాటలు విని దూరాలోచనగలవా రెవ్వరు చెడి పోకుడు. ” ఈ రాజభక్తుల ముఖ్య పత్రిక యగు రాయల్ గెటిన్ ఆసు పత్రికలో పసిపిల్లలకు తండ్రి యొక్క ఆవశ్యకత యెంతగలదో, అమెరికా యొక్క సురక్షితమునకును గౌరవ మునకును ఆంగ్లేయ, ప్రభుత్వము యొక్క ఆవశ్యకత యంతకలదని సదా వ్రాయుచుండెను.


అమెరికా స్వతంత్రమును పొందిన తరువాత అదివరకు రాజభక్తులు ,ప్రకటించుచుండిన భావము. లన్నియు అబద్దముగ తేలను, ఐక్యత చెడలేదు. రక్త ప్రవాహములు కలుగ లేదు. అంతర్యుద్ధములు రాలేదు. తమ దేశపాలనము మొక్క జవాబుదారీ తమమీద పడగనే తమదేశము యొక్క గౌరవము కొంకును ఘగతి కొరకును అందరుసు కలసి పని చేసిరి. స్వతంత్రము పొందుట అమెగాకు, దురదృష్టమగు