పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/293

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

అమెరిశా సంయుక్త రాష్ట్రములు

తము పగ్రీలను కృపాణములను విడిచి పెట్టలేదు. వీరిని. చూడగానే సిక్కులని తెలియును. హిందూ దేశీయులు నల్లవారను హేతువుచేత నీగ్రోలను చూచినంత హీనముగను అస హ్యముగ చూడకపోయినను సాధారణముగ అమెరికావారు పూటకూండ్ల యిండ్లలో కి రానివ్వరు. సమానముగ కూర్చొమట కంగీకరించరు, యూరపు ఖండమునుండి వచ్చు బీదవాంరు ఆజ్ఞానములోను అశుభ్రతను హైందవ కూలీల కంటే మించినను వారిని అమెరికనులు తమతో సమానులుగ చూచెదరు. తురుష్క ముసల్మానులను, పర్షియనియా ముల్మానులను జపామవారిని హైందవులకన్న బాగుగా చూచె దరు. ఎందువల్లవనగా హిందూదేశము స్వతంత్ర దేశము కాదు. స్వతంత్ర దేశములవారు నల్లవారయినను వారివి గొంతవరకై నను గౌరవించక తప్పదు. దక్షిణ రాష్ట్రము లలో "హైందవులు "తెల్లవారు పెట్టుకొను టోపీలు ధరించి నచో వీరిని నీగ్రోలని భావించి మిగుల హీనముగా చూచి నానాభాధలు పెట్టెదరు. అచ్చట తలగడ్డలు పెట్టుకున్న చో నీగ్రోలకన్న యెక్కువ గౌరవముగా చూచెదరు. తరచుగా హైందవులకు అమెరికను మంగలులు క్షౌరము చేయ టకు నిరాకరించెదరు. అమెరికాలోని పశ్చిమ ప్రాంతముల భార తీయులు తెల్లవారి టోపీలు ధరించి పోయినచో అమెరికసుల పూటకూండ్ల యిండ్లలోనికి రానిచ్చెదరు. భారతీయ కూలీలు తెల్లవారికంటే చౌకగా కూలికి పోవుదురనియు యెక్కువ కష్టపడి పనిచేసి మితవ్యయము కలిగి సొమ్ము మిగుల్చుకొన గలుగుదురనియు వర్తకపు పోటీలో తెల్లవారి నోడించుచున్నా