పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/281

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

అమెరికా సంయుక్త రాష్ట్రములు



దాక్షిణ్యములు చూపగ, బానిసలను పోగొట్టుకొనినందుకు . భూఖాముందులకెట్టి నష్టపరిహారమును ఇవ్వక, సైనికులను బంపి దక్షిణ రాష్ట్రములలోని బాసిసలకందరికిని బలవంతముగా సేచ్ఛనిచ్చిం. దక్షిణాది భూకామందులు తమతము. రాష్ట్రప్రతినిధి సభలలో విశేషముగ పలుకుబడి గలిగియుండి నందున దానినంతయు వినియోగించి సేచ్ఛనొందిన నీగ్రోలపై నిర్బంధములు ప్రయోగించి వారిని బానిసత్వమునకు తుల్య మగు స్తితికి తెచ్చుటకు సర్వప్రయత్నములను చేసిరి. నీగ్రోలకు స్వేచ్ఛవచ్చేనేగాని వారికి తినుటకు తిండి లేదు. కట్టు కొనుటకు బట్టలు లేవు. నిలచుటకు నీడ లేదు. ఈ అవకాశము తీసుకొని దక్షిణ రాష్ట్రములవారు. పెక్కు నిర్బంధ శాసనములను చేసిరి. అయిదుగురు నీగ్రోలు కలిసి మాట్లాడిన, నేరమని చట్టము చేసిరి. నీగ్రోలు స్వేచ్చమొందినప్పటికి తెల్లవారితో సమానులు కారనియు గావున ఎట్టిపౌరస్వత్వములు లేవనియు శాసించిరి. పదునెనిమిది సంవత్సరములలోపున సున్న నీగ్రోలకు నిర్బంధముగా పని నేర్పవలెననియు వెనుకటి యజమానుల క్రిందనే పని నేర్చుకొనవలెననియు శాసించిరి. నీగ్రోలు తెల్లవారి క్రింద కఠిన షరతులకు లోబడి నౌకరీచేయునట్లు నిర్బంధించిరి. తెల్లవారికి నీగ్రోలెప్పుడును ఋణపడునట్లు ఏర్పాటు చేసి ఋణపడిన నీగ్రో తనఖాకీ దారుడగు తెల్లవాని కింద నిర్బంధముగా పనిచేయునటుల శాసించిరి. ప్రతి స్వల్ప నేరమువకను నీగ్రోలకు ఖైదు వేయుటయు ఖైదు వేసినవారిచేత తెల్ల వారికింద పనిచేయించుటయు జరిగెను. నీగ్రోలు సాధారణముగా పనిలేక నేరములుచేయు ద్రిమ్మరు