పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/277

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

అమెరికా సంయుక్త రాష్ట్రములు



రాష్ట్రములు నూతన ప్రభుత్వ పక్షమునను నిలువబడి పోరాడినవి. అబ్రహాము లింకను కోరగనే ఒక లక్ష మంది ఐచ్చిక భటులు ఉత్తర రాష్ట్రములనుండి యుద్ధము జేయుట నేనలలో జేరిరి. యుద్ధము 1861వ సంవత్సరము జులై నుండి 1865వ సంవత్సరము యేప్రిలు వరకును జరిగెను. జరిగిన యుద్ధములను వర్ణించుట కీచిన్న పుస్తుకమలో తావు లేనందున వదలి వేసితిమి. ప్రారంభమున దక్షిణ ప్రభుత్వము కొన్ని జనుములను పొందినను అబ్రహామలింకను పట్టుదలతో యుద్ద ముసాగించి సంపూర్ణ జయయులను సంపాదించెను. మధ్యమధ్య కొన్ని రాష్ట్రములు లోబడెను. వీటికి ఆయనసంపూర్ణమగు క్షమాపణ నిచ్చుచువచ్చెను. 1864 వ సంవత్సరము సెప్టెంబరు 19 వ తేదీన గెట్టీసుబర్గులో యుద్ధములో మరణించిన వారి స్మశాన వాటికను తెరచుచు అబ్రహాం లింక నిటుల చెప్పెను. “ఎనుబదిఏడు సంవత్సరములకిందట మనపూర్వ ఖండములో స్వతంత్రమును పొందినట్టియు అందరుమనుష్యులును సమానులునను సిద్ధాంతమును నమ్మునట్టియు నొకజాతిని ఏర్పరచి నారు. ఆజాతిగాని లేదా అట్టి సిద్ధాంతములుగల జాతి గాని చాలకాలము నిలుచునా లేదా యసు సమస్యాపరిష్కా రమున మసమొక గొప్ప అంతర్జాతీయ యుద్ధములో నిపుడు మునిగియున్నాము. ఆయద్దములోని యొక గొప్ప యుద్దభూమిలో మనమిపుడు సమావేశమైనారము. ఆజాతి ప్రపంచమున స్థిరముగ నిలంచుటకుగాను తమ ప్రాణములనర్పించిన ధీరులకు విశ్రాంతి స్థలముగా నీభూమిలో కొంతభాగము ఏర్పరచుట కచటికి చేరినారము, మిగతాపనిచేయుట ఎంతయు ఆర్దమై