పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/276

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదకొండ అధ్యాయము

255


తముగనుండుట అసంభవమనియు, సంయుక్త రాష్ట్రములు ప్రభుత్వము బెదిరింపులతో కూలి పోదనియు "యెమ కి ని చీలిపోవుటకు హక్కు లేదనియు, చెప్పుచుండెను. ఆయన అధ్యక్ష పదవిని స్వీకరించు దినమున యెట్టి యాటంకములు కలుగకుండ స్కాటు నేనాని సైన్యములతో ముఖ్యపట్టణమును కాచుచుండెను. కొంతకాల మాయన తగిన సూతన యుద్యోగస్తుల నేర్పరచు కొనుటలో గడపవలసి వచ్చెను. మొదటనే బానిసత్వమును రద్దు పర్చుటకోరకై తాను యుద్ధము చేసెదనని ప్రకటించ లేదు. కానీ తాను విడచిపోదలచిన 'రాష్ట్రములను బలవంతపర్చి సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వ ముక్రింద నుంచెదననియు యిందు కవసరమైనచో యుద్దమును చేసెదననియు చెప్పెను. ఎట్లయినను ఉభయపక్షముల వారును పోరుసకు తయారగుచుండిరి. తిరుగ బాటుదార్లే యుద్ధమును , ఫారంభించినవారైరి. దక్షిణ కారొలీనా రాష్ట్రములోని కొన్ని కోటలను సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వమువారు స్వాధీనమందు చుకొనియున్నందున వాటిని వెంటనే తమకు స్వాధీన పరచవలసినదని యాసేనాధి పతిని దక్షిణకారొలినా వారుగోరిరి. సేనాధిపతి తిరస్క.రించెను. దక్షిణ కొలీనావారు సైన్యములనుబంపి ముట్టడించి యాకోటలను స్వాధీనమును పొందిరి. ఇందుమీద అబ్రహాము లింకను నూతన ప్రభుత్వము పై యుద్దమును ప్రకటించెను.


పైన చెప్పిన యేడు రాష్ట్రము లేగాక మిగిలిన నాలుగు రాష్ట్రములును వీటిలో చేరెను. యిరువదిండు రాష్ట్రములు సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వ పక్షమునను పదకొండు