పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/272

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

251

పదకొండవ అధ్యాయము


ఇరువదియిద్దరు నీగ్రోలునుకలిపి వర్జీనియాలోని బానిసల నందరసు స్వతంత్రవంతులుగ చేయవలెనని కుట్రలుపన్నిరి. అవసరమైనచో ఆత్మసంరక్షణకొరకు కొన్ని ఆయుధ రులను కూడ సేకరించిరి. " 16వ అకోలకు తేదీన వర్జీనియా రాష్ట్ర ప్రభుత్వమువారు సేనలను బంపి యాయన యున్న గ్రామమును ముట్టడించి ఈయనను గొనిపోయిరి. ఈయనను ఈయన యొక్క నలుగురు కుమాళ్ళను ప్రభుత్వమువారు విచారించి ప్రభుత్వ విద్రోహులని తీర్మానించి డిశంబరు రెండవ తేదీన ఉరితీసిరి.


ఇట్టి పరిస్థితులేర్పడి బానిసత్వమునుగూర్చి తీవ్రమగు రెండు కక్షలేర్పడియున్న సమయమున 1860 వ సంవత్సరమున అమెరికా సంయుక్త రాష్ట్రముల కాంగ్రెసు ( శాసన సభ)లకు ఎన్నికలువచ్చెను. అమెరికా సంయుక్త రాష్ట్రము లలో సంపూర్ణముగ బానిసత్వము నిర్మూలము కావలెనా లేదా యను నమస్య మీదనే ఎన్నికలు జరిగెను. సృష్టిలో మానవులు సమాసలుగ పుట్టినారను సిద్ధాంతము కల్పితమనియు ఈశ్వరుడే కొందరిని ఎక్కువవారిగమ కొందరిని తక్కువ వారిగను పుట్టించినాడనియు ఎక్కు వవారికి తక్కువవారు కొలువవలెననియు బానిసత్వము ఈశ్వర నిర్మితమైనదనియు దక్షిణపు వారు వాదించిరి. వారు విశేష ద్రవ్యము ఖర్చు పెట్టిరి. గొప్ప ఆందోళసముచేసిరి. నల్లవాడు కూడ తక్కిన మనుష్యులవలెనే పుట్టినాడనియు అతనికిని ఆత్మ బుద్ధి, మనస్సాక్షి, తెలివి తేటలు గలవనియు దానిని నిర్బంధించి వానిబుద్దిని, ఆత్మను వికసింపకుండునట్లు అణచివేయుట పాపం