పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/270

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

పదకొండవ అధ్యాయము


తరువాత భగవదసుగ్రహమువలన ఆమె స్వస్థతను స్వేచ్చను పొందెను. అనేక మారులు స్త్రీలు పురుష వేషములు ధరించియు పురుషులు స్త్రీ వేషములను ధరించియు పారిపోవు చుండిరి. తరుచుగా స్వేచ్చావంతనుగు రాష్ట్రమును చేరుట, అరణ్యములగుండను కొండల గుండను వందల కొలది మైళ్లు నడచు చుండిరి. దక్షిణ రాష్ట్రములవారు మిగుల పట్టుదలతో బానిసవ్యాపారమును స్థిరపరచుటకై పనిచేసిరి. బానిసలమీద నెక్కున కఠిన పద్దతులను ప్రయోగించిరి. వారికి సహాయము చేయు వారిని కఠినముగ శిక్షించిరి. ముగ్గుకు బానివలను ఉత్తర రాష్ట్రములకు రవానాచేసిన ళామ్యుయలుస్మిత్తును పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వమువారు విచారించి ఎనిమిది సంవత్సరముల కథిన ఖైదు వేసిరి. బానిసలలో రహస్య సంఘము లేర్పడెను. అక్కడక్కడ స్వతంత్రములకై బానిసలు తిరుగ బాటుచేసిరి. 'ఆతిరుగబాటులను ప్రభుత్వము వారు మిగుల ఘోరమగు పద్దతులచే నణచిరి. తప్పించుకొని పోవుటకు రహస్య సంఘములో చేరినటుల తెలిసినచో బానిసను క్రూరవధ గావించిరి. గాని స్వేచ్చను పొందుటకు కోరికయు పట్టుదలయు బానిసలలో హెచ్చెను. ఏమాత్ర మవకాశమున్నసు స్వతంత్రమును పొందగోరుట మానవస్వభావము. దక్షిణరాష్ట్ర ములలో గూడ బానిస వ్యాపారమువలన తెల్లవారిలో గొప్ప భూఖామందులకు మాత్రమే లాభముగాని బీదస్థితి లోనున్న చిన్న వ్యవసాయికులును కార్మికులుసునగు తెల్లవారికి బావినల వలన నష్టమే కలుగుచుండెను. బానిసలు లేకుండిన వీరే