పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/264

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

243

పదకొండవ అధ్యాయము


నేర్చుకొనుటకును విరోధమని యజమానులు గ్రహించిరి. నిరంకుశముగా, పాలించు హరికి తమక్రిందనున్న జాతివారు విద్య నేర్చుకొని జ్ఞానమును పొందుట స్వభావముగా ఇష్టముండ నేరదు. కావున వీరివిద్యాభివృద్ధికై విశేషముగా తోడ్పడరు. బానిసత్వమువలన యజమానిలో దురాక దురాగ్రహము ఆధర్మబుద్ధి నిరంకుళత్వము నిర్దయ వృద్ధి చెందును - తనకు కొంచెము అవిధేయతను చూపిన సహించ నేరము గోపము వచ్చిన కత్తితోసరుకును. తుపాకీతో కాల్చును. ఏమి చేసినను అడుగురారుండరు. దానికి (tyrants mentality) నిరంకుశ బుద్ధి అని పేరు. బానిసలో పిరికి తనము, అబద్దము లాడుట యజమాని మెప్పునకై ఎట్టి నీచపుపసులైనను చేయుట ఆత్మగౌరము నశించుట ఆత్మవిశ్వాసము లేకుండుట మొదలగు నైచ్యగుణము లలపడును. దీనికి ( Slave mentality} బానిస బుద్ది అని పేరు కాని సత్వము యజమాని లోను బానిసలోను మనుష్యత్యమును నిర్మూలింప జేసి యజమాజని రాక్షసిగను, బానిసను నీచజంతువుగను, చేయును. వ్యక్తుల కెట్లో జాతులకును అట్లే నిరంకుశముగ పాలించు జాతికి నిరంకుశ బుద్ధియు బానిసత్వము లోనున్న జూతికి బానిన బుద్ధియ ఏర్పడును.


అమెరికా స్వతంత్ర యుద్దమువలన అమెరికాలోని తెల్ల వారికి మాత్రమే స్వతంత్రము లభించినది. కాని నీగ్రోలు గాని ఎర్రయిడియనులుగాని రాజకీయ హక్కులు పొందక ఫోగా ఆ ఖరుకు బానిసత్వము నుండియైన విముక్తి చెందలేదు.