పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ అధ్యాయము

9


"నాక్రమించుకొనిరి. ఇక నేబది సంవత్సరముల వరకును పరాసువారును, డచ్చి (హాలెండు) వారుసు, ఆంగ్లేయులును, అమెరికాకుగాని హిందూదేశమునకుగాని బయలు దేరలేదు.

{{స్పైన్ పోర్చుగీసు వారి లాభములు}} పోర్చుగీసువారే ముందుగ హిందూదేశము లోని స్పైన్ పోర్చుగీసు రాజులనాశ్రయించి కొన్ని సముద్రరేవులలో స్థలములను సంపాదించి యచటగిడ్డంగులను కట్టుకొని వ్యాపారము చేయుచుండిరి. స్పైన్ వారును పోర్చుగీసువారును త్వరితముగ మిగుల నైశ్వర్య పంతులయిరి. ఆసియా ఖండముతో వర్తకమువలన చాల లాభము వచ్చుచుండెను. అమెరికా శీతోష్ణస్తితి మిగుల యనుకూలముగ నున్నందున చాల మంది యచటికి వలస వెళ్ళి సౌఖ్యముగ నివసించుచుండిరి. అచట వీరు దేశమాక్రమించుట కెట్టి అడ్డును లేకుండెను. అమెరికాలోని భూమలు గనులు అడవులు వీరివశ మయ్యెను. బంగారముతోను మేలైన సరకులను నిండిన పడవలతో ఆసియానుండియు ఆమెరికానుండియు నీరెండుజూతుల వారును తమదేశములకు వచ్చుచుండిరి. వీరిలో వీఱికి కలతల కలుగకుండ వీరి గురువగు (పోపు) రోములోని క్రైస్తవ ప్రధానాచార్యుడు. కాగితము మీద నొక గీతగీసి ప్రపంచములోని కేఫువర్డిలంకలకు పశ్చిమ భాగమంతయు స్పైన్ వారికిని, తూర్పు భాగమంతయు పోర్చు గీసువారికిని ఇచ్చి వేసెను. ఈ యుభయజాతుల సాధారణ యైశ్వర్యాభివృద్ధిని చూచి యూరపు ఖండములోని తక్కిన జాతుల వారందరును మేల్కొనిరి.