పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది

8

అమెరికా సంయుక్త రాష్ట్రములు


మంది జనులతోడను నానూతన ద్వీపములను స్పైన్ రాజు పక్షమున స్వాధీనమును పొందుటకు క్రిస్టఫరు కొలంబసు పయన మైపోయెను. వాటిని వశపరచుకొని స్పైన్ రాజుయొక్క, ప్రతినిధిగా కొంత కాల మాయనపాలించెను. ఇది యమెరికా ఖండమునకు తెల్లజాతుల వారువచ్చి చేరుటకు ప్రారంభము. స్పెన్ దేశమునుండి అనేకు లీద్వీపము లలోనేగాక వీటికి సమీ పముననున్న యమెరికాఖండమునగూడ వలసవచ్చి నివసించిరి. అమెరికా యొక్క నూతన భాగములను కనిపెట్టుచు నాక్రమించుకొనుచుండిరి,


ఇంతలో పోర్చుగీసువాడగు వాస్కోడిగామా 1498 వ సంత్సరమున ఆఫ్రికాఖండమునుచుట్టి హిందూదేశము దేశమును చేరెను. 1519వ సంవత్సరమున చేరుట,

హిందూ స్పైన్ రాజు కొలువునందుండిన మెగల్లర్ అను వాడు అయిదు

దేశము పడవలతోను రెండువందలమంది మనుష్యుల లోను స్పైక్ దేశమునుండి

చేరుట

బయలు దేరి దక్షిణ అమెరికాయొక్క దక్షిణ భాగము చుట్టును సముద్రము

మీద తిరిగెను. అక్కడనుండి పెనామా జలసంధివరకును పోయెను. పశ్చిమముగా పయనముచేసి ఫిలిఫ్పైన్ ద్వీపములను కనుగొనెను. అచట దిగి యాద్వీపవాసులతో పోరాడి హతుడయ్యెను. అతనితో వెళ్ళినవారిలో చాలమంది కూడ చంపబడిరి. 1522 వ సంవత్సరమున కొక పడవయు ముప్పది యొక్క మంది మనుష్యులును స్పైన్ దేశమునకు తిరిగిపచ్చిరి. ఇంతటినుండియు 'స్పైన్ వారును పోర్చుగీసువారును అమెరికాఖండములోని మధ్య భాగమును దక్షిణభాగమును క్రమక్రమముగా సంతయు