పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/244

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

223

పదవ అధ్యాయము



పదునారు రెట్లును జనసంఖ్యలో ఏడు రెట్లును పెద్దది. సంయుక్త రాష్ట్రములు వైశాల్యమునందు హిందూదేశముకన్న రెట్టింపుగలను. ప్రస్తుతము జనసంఖ్యయందు మాత్రము హిందూదేశములో మూడవవంతుగలదు. కాని జనసంఖ్య త్వరితముగ పెరుగుచున్నది. సంయుక్త రాష్ట్రములలో వందొమ్మిది రాష్ట్రములలో పదిలక్షలకన్న తక్కువ జనసంఖ్య గలదు. అనగ కృష్ణాజిల్లా యొక్క జనసంఖ్యలో సగమైన లేకు న్నవి. బర్మాగాక మిగిలిన హిందూదేశము ఆంగ్లేయ పాలనము క్రింద పది రాష్ట్రములుగ మాత్రము విభజించబడినది. సంయుక్త రాష్ట్రములు నలుబది ఎనిమిది రాష్ట్రములుచేరియున్నది. సుయుక్త రాష్ట్రములివుడు లోకములో కెల్లమిగుల భాగ్యవంత ముగనున్నవి. వాటి ప్రభుత్వపు ఆదాయము ఇంగ్లాండుకన్న ఒక టింపాతికె రెట్లును హిందూదేశ ముకన్న పది రెట్లునుగలదు. హిందూ దేశములో ప్రతిమనుష్యునకును సగటున ఆదాయము సాలుకు ఇరువదిఅయిదు రూప్యములు సుయుక్త రాష్ట్రములలో ప్రతి మనుష్యునకును సగటున ఆదాయము సాలుకు ఎనిమిదినందం రూవ్యములు. హిందూదేశములో ముప్పది అయిదు వేల మైళ్ల పొడుగున రైలు వేలు (ధూమశకటయానములు), వేయబడిసవి. సంయుక్త రాష్ట్రములలో రెండులక్షల ఏబదినాలుగు వేల మైళ్ల పొడుగున వేయబడినవి. హిందూదేశము పరాధీన మైయున్నది. రెండువందల సంవత్సరములక్రింద లోక ములో కెల్ల భాగ్యవంతమైన దేశము నేను లోకములో కెల్ల దరిద్రవంత మైయున్నది. సుంయుక్త రాష్ట్రముల స్వపరిపాలన వనుభ వించుమన్నవి. లోకములో కెల్ల దరిద్రవంతమకు అట