పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/239

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

అమెరికా సంయుక్త రాష్ట్రములు


లేకుండ చేసినారు. సివిలు న్యాయాధిపతులకే క్రిమినలు న్యాయమునుకూడ చేయు అధి కారముల నిచ్చి అందరు న్యాయాధిపతులను హైరోర్టుకు లోబడునట్లు చేసినారు. ఇది మిగుల సమంజసముగానున్నది.

రాష్ట్రములోని
ప్రభుత్వములు.


సంయుక్త రాష్ట్రములలోని రాష్ట్రముల ప్రభుత్వము లన్నియు ఒకే పద్దతిగ లేవు. గాని ప్రతి రాష్ట్రంలోను రెండు శాసనసభలు గలవు.చాలవరకు ప్రజా ప్రతినిధి సభయనియు శిష్ట నభయనియు వాటి పేర్లు కొన్ని రాష్ట్రములలో వాటికి వేరు పేర్లు గలవు. ప్రజా ప్రతినిధి సభకు రెండేండ్ల కొకసారియు శిస్టసభకు నాలుగు సంవత్సరముల కొకసారియు యెన్నికలు జరుగును. రెండు సభలకును సభ్యులను యెన్నుకొను అర్హత గల ప్రజలే యెన్నకొదరు. ప్రతి రాష్ట్రమునకు కార్య నిర్వాహణము చేయుటకు గవర్నరు నలుగురు మంత్రులు గలరు. కొన్ని రాష్ట్రములలో నింక నెక్కువమంది మంత్రులు గలరు. వీరివందరిని ప్రజలే యెన్నుకొనెదరు. చాల రాష్ట్రములలో రెండు సంవత్సరముల కొకసారి వీరి యెన్నికలు జరుగును. కొన్ని రాష్ట్రములలో నాలుగు సంవత్సర ముల కొకసారియు కొన్నిటిలో మూడు సంవత్సరముల కొక సారియు యెన్నికలు జరుగును. చాలరాష్ట్రములలో న్యాయాధిపతులు కూడ ప్రజలచే యెన్నుకొన బడుదురు. తక్కిన రాష్ట్రములలో గవర్నరులు శిష్టసభ వారి సమ్మతితో న్యాయాధిపతంలను నియమింతురు. స్వల్ప సంఖ్యగల రాష్ట్రలలో మాత్రము శాసవనభలు న్యాయాధిపతులను నియమిం