పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/233

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

అమెరికా సంయుక్త రాష్ట్రములు


అధ్యక్షుడు.


సంయుక్త ప్రభుత్వములో రెండవ భాగము అధ్యక్షుడు.యాపత్తు ప్రభుత్వ నిర్వహణ భారమును ఈయసమిదనుండును. ఈయనయును ఉపాధ్యక్షుడును నాలుగు సంవత్సరముల కొక సారి ఎన్నుకొస బడుదురు. ఇందునిమిత్తము ప్రతి రాష్ట్రమ లోని ప్రజలు కొంతమంది ఓటర్లను (ఎన్నుకొను అధికారముగలవారిని) ఎన్నికొనెదరు. ఆఓటర్లు సంయుక్త రాష్ట్రముల ఆధ్యక్షుని ఉపాధ్యతుని ఎన్నుకొనెదరు. ఏరాష్ట్రము కైనను శిష్టసభ లోసు ప్రజా ప్రతినిధిపభ లోను కలిసి ఎంతమంది సభ్యులు గలరో అంతమంది ఓటర్లు ( electors ) ఆ రాష్ట్ర ప్రజలెన్ను కొనవలెను. శాసనసభ్యులుగాని ఉద్యోగస్తులుగాని ఓటర్లు (electors) గా ఎన్నుకొనబడగూడదు. పాత అధ్యక్షుని శాలపరిమితి యొక్క ఆఖరు నవంబకులోని మొదటి మంగళ వారము నాడు ఎలెక్టర్లు (ఓటర్లు) ఎన్నుకొనబడెదరు. అధ్యక్ష వరవికిగాని ఉపాధ్యక్ష పదవికి గాని అభ్యర్థి గానుండువాడు సంయుక్త రాష్ట్రములలో జనని మొందిన పౌరుడుగనుండవలెను.. విదేశస్తుడై సంయుక్త రాష్ట్రముల పౌరస్వత్వములను పొందిన వాడు ఏయుద్యోగమునకైన అర్హ డేగాని అధ్యక్షుడు గాని ఉపాధ్యక్షుడుగాని కానేరడు. అధ్యక్షుడును ఉపాధ్యక్షుడును ముప్పది అయిదు సంవత్సరములు తక్కువగాని వయసుగల వారుగను సంయుక్త రాష్ట్రము లలో పదునాలుగు సంవత్సర ములకు తక్కువగాని కాలము కావుర మున్న వారుగసు ఉండ వలెను. ఉపాధ్యక్షునకు నెఱకు నాలుగు వేల రూప్యములు జీతమిచ్చెదరు. అధ్యక్ష పదవి ఖాళీ అయి;చో ఉపాధ్యక్షుడు