పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/227

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

అమెరికా సంయుక్త రాష్ట్రములు



అంగీకరించెను. గాని సంయుక్త ప్రభుత్వ విధానము నేర్పంచు -కొనుటలో రాష్ట్రములు తమ ప్రత్యేక వ్యక్తిత్వమును పోగొట్టుకొనుటకును తమ యాపత్తు స్వతంత్రమును పూర్తిగా జాతీయ ప్రభుత్వమునకు లోబరుచుటకును సమ్మతించలేదు, రాష్ట్రములు ప్రధమమున సర్వాధికారములు గలవి. అవి అవ సరమునుబట్టి కలసినవి కావున అన్ని రాష్ట్రములకును అనగా మొత్తపు సుయుక్త రాష్ట్రముల జూతికి సంబంధించిన సమ్మష్టి విషయములలో మాత్రమేసనగా రాజ్యంగ విధానములో స్పషీకరించిన విషయములలో మాత్రమే నిర్దిష్టమగు అధికారములు చలాయించుటకు జాతీయ సంయుక్త ప్రభుత్వము చేర్పరచుకొనెను. ఈయేర్పాటు ప్రకారము రాష్ట్రము లన్నియు ననేక ముఖ్యమగు విషయములలో జాతీయ ప్రభుత్వమునకు లోబడి నడచుకొనవలసి నప్పటికిని, జాతీయ ప్రభుత్వముకు యివ్వబడని అధికారము లన్నియు రాష్ట్రప్రభుత్వముల యందే యుండును. జాతీయ ప్రభుత్వపు అధికారము నిర్దిష్టమైని, మితమైనది. రాష్ట్ర ప్రభుత్వల అధికారము అనిర్దిషమైనది, అమితమైనది. జాతీయ ప్రభుత్వమును చలా యించుట కవసరమగు పన్నులు, జాతీయ ఋణము, సుంకములు, ఎగుమతి దిగుమతి సరుక లమీద పన్నులు, విదేశ సరుకులమీద పన్నులు, విదేశములతోను రాష్ట్రముల మధ్యను వర్తక వ్యాపారములను గూర్చిన నిబంధనలు, పోస్టు, పోస్టురోడ్లు, తంతి, ధూమశక్కటములు, పొగ యోడలు, సైన్యము, నావికాదళము, విదేశస్తుల విషయములు, యుద్ధము, సంధి, కొత్త రాజ్యములను సంపాదించుట, విదేశ వ్యవ