పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/226

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

205

ఎనిమిదవ అధ్యాయము



చేయుట కందులో చెప్పబడిన విధానము ననుసరించియే మార్పులు జగుగుచున్నవి. వంయుక్త రాష్ట్రములు యేబది రెండు రాష్ట్రములను కలిగియున్నవి. ఈ అన్ని రాష్త్రములును కలిసి సమృష్టి విషయములలో నొక జాతీయ ప్రభుత్వము.. క్రింద నున్నవి, "ఇదిగాక యేరాష్ట్ర ప్రభుత్వము ఆరాష్ట్రమున కున్నది.

రాష్ట్రముల
వ్యక్తిత్వము.

ప్రథమమున సంయుక్త రాష్ట్రములు గా చేరి సంయుక్తప్రభుత్వము నేర్పరచుకున్న పదమూడు రాష్ట్రములుసు ఒకేకాలమున ఒకే చట్ట, ప్రకారము పుట్టినవి కావు. దేనికది. ప్రత్యేకపరిస్థితులలో ఏర్పడినది. ఆంగ్లేయ ప్రభుత్వము కిందనివియన్నియు సున్నప్పటికిని అన్నిటికిని సమానహక్కులు లేకుండెను, వివిధ రాష్ట్రములకును వివిధములగు హక్కులుగల దానశాసనము లుండెను కొన్ని రాష్ట్రములు ఆంగ్లేయ "రాజుయొక్క స్వంతమ క్రిందను,కొన్ని భూఖామందులక్రిందను, కొన్ని ప్రజా సమూహముల కిందను, కొన్ని ప్రత్యేక సంఘములకిందను, దాసపట్టాలు పొందెను. ప్రతి రాష్ట్రమునకును వేరు వేరగు పద్దతులమీద శాసనసభలు, అధికారవర్గము, న్యాయ స్థానములు మొదలగు పరిపాలనా పక్మురికరము లండెను. ఆంగ్లేయ ప్రభుత్వము వారి నిర్బంధములకు తాళజాలక అన్ని రాష్ట్రములును కలిసి తిరుగు బాటును సాగించి స్వతంత్రమును పొందెను. స్వతంత్రము పొందిన తరువాత విడివిడిగా నుండుటవలన తమక పొయము కలుగునని తలచి అన్ని రాష్ట్రములునుకలిసి యొక జూతీయ సంయక్త ప్రభుత్వము క్రిందికి వచ్చుటకు