పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ అధ్యాయము


వచ్చి చరెను. సుల్తానుగారి యనుగ్రహమును పొందిన వెనీసు పట్టణము వర్తపకు సౌకర్యములను పొంది భాగ్యవంత మయ్యెను. వారి యనుగ్రహము పొందజాలని జినోవాపట్టణ ముయొక్క వర్తకము నశించి క్షీణించెను. సముద్రముల మీద ఆసియాఖండమునకు వచ్చి చేరుటకు కొత్తత్రోవలు కను గొనవలెనని యూరపుఖండపు జాతులు ప్రయత్నములను చేయ సాగిరి. ఆసియాలోని తూర్పు దేశములతో వర్తకము చాల లాభకరముగ నుండెను. ముఖ్యముగ హిందూదేశముతోటి వర్తకముచేయుట మహాభాగ్యమని తలచిరి. అక్కాలమున ఐశ్వర్యమునకును నాగరికతకును వర్తక వ్యాపారములకును హిందూదేశము ప్రపంచములో కెల్ల మిగుల ప్రతిష్ట కలిగి యుండెను. మేలైన దూది పట్టు ఉన్ని వస్త్రములును, రత్నము లను, లోహవుసరుకులును, రత్నకంబళ్ళు తివాసీలును, పరిమళ , ద్రవ్యములును, మొదలగునవి హిందూదేశమునుండి యూరవునకు విరివిగ ఎగుమతి యగుచుండెను. ఎటులైన హిందూ దేశమునకు తోవలు కనిపెట్టవలెనని వివిధజాతులవారును ప్రయత్నములు సలిపిరి, ఆఫ్రికా ఖండమును చుట్టి హిందూ దేశమునకు నచ్చుటకు ప్రధమమున పోర్చుగీసువారు ప్రయత్నించిరి. 1486వ సంవత్సరమున డయ్యజు అను పోర్చుగీసువాడు ఆఫ్రికా ఖండము యొక్క దక్షిణభాగమువరకును వెళ్ళి తిరిగివచ్చెను, జనోవా కాపురస్తుడగు క్రిస్టీఫరు కొలంబసు అను నాతడు సూటిగ అట్లాంటికు మహాసముదములో పడమరగ ప్రయాణముచేసి హిందూ దేశమును చేరవచ్చునని నిశ్చయించెను. అప్పటి కమెరికా ఖండ మనునది గలదని