పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/216

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

197

ఎనిమిదవ అధ్యాయము



ములో సమెరిశా రాష్ట్రములలో బానిసత్వమును రద్దు పరచుట కొక నిబంధనను జెఫర్చను చేర్చెను. కాని దక్షిణమున నున్న దక్షీణ కారొలీనా జార్జి రాష్ట్రములవారు బాని సత్వమును మాన్పుటకు ప్రయత్నించినచో తాము సంయుక్త రాష్ట్రముల చేరమని బెదిరించినందువ నిబంధనను కొట్టి వేసిరి. ఇచ్చనచ్చిన రాష్ట్రములవారు బానిసలకు స్వేచ్చ నివ్వవచ్చుననియు నిష్టము లేనివా రివ్వనక్కర లేదనియు చివరకు రాజీపడిరి. ఉత్తర రాష్ట్రములలో బానిసత్వమునకు వ్యతిరేకభావము తీవ్రముగ ప్రబలియుండెను. 1780 వ సంవ త్సరమున మెపషు సెట్సు, పెన్ని సిల్వానియా కూడా రాష్ట్రముల వారును, 1784 సం|రం స్యూహంపు పైరు రాష్ట్ర మువారు , 1784 సంవత్సరమున కనెక్టికటు, రోడు అయిలాండు రాష్ట్ర ములవారును బానిసత్వమును రద్దుపరచిరి. 1783 సంవత్సర మొక బానిస తప్పించుకొని మెసషు సెట్ను రాష్ట్రములో వచ్చిచేరెను. వెంటనే బానిసత్వము తొలగెను. యజమాని యా బానిసను పట్టుకోను యత్నించెను. స్వేచ్ఛకొందిన వారిని పట్టుకొనుటకు హక్కు లేదని తీర్మాసించిరి. 1790 వ సంవత్సరమున జరిగిన జనాభాగణితీలో నీ రాష్ట్రములోని బాని నలసంఖ్య సున్న యని వ్రాసియిచ్చిరి. డెలవేరు న్యూజర్సీ రాష్ట్రములలోకూడ బానిసలకు స్వేచ్చ నొసంగుటకు యజ మానులను ప్రోత్సాహించు చట్టములను చేసిరి. వర్జీనియా రాష్ట్ర ప్రముఖులగు జెఫరుసను పాట్రికు హెంరీ, జూర్జిమే సనులు బానిసత్వమునకు బద్దశత్రువులుగ నుండిరి. కాని సేనలలో చేరెడు ప్రతి అమెరికనునకును ఒక నీగ్రో బానిసను పారితోషిక