పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

183


రనేరదు. నామీద తిరుగబాటు చేసిన అమెరికనులను పూర్తిగ లోబరచుకొనుటకన్న మరి యెద్దియు నాకు సంతృప్తి కలుగ చేయ నేరద "ని యగ్ధమగుచున్నదని ఫాక్సు చెప్పెను. ఇందుకు ప్రత్యుత్తరముగ అమెరికా మీద ఆంగ్లేయ దేశముయొక్క బ్రతుకు ఆధారపడియున్న దనియు అమిరికాయొక్క స్వాతం త్ర్యము నకు తామంగీరించజాలమనియు పర్జీనియాలో సాంలేయు లకు గలిగిన పరాభవము వలన నాంగ్లేయలు మరింత పట్టు దలతో యుద్దమును కొనసాగించ వలెననియు మంత్రులు చెప్పిరి. పార్లమెంటు సభ్యులలో నెక్కువమంది మంత్రుల వక్షము ససే సమ్మతుల నిచ్చిరి. కానీ పది హేనురోజుల తరువాత " అమెరికా వారిని నిర్బంధించి రాజభక్తిని పొందుట సాధ్యమయిన పని కానేరదని ” ప్రధానమంతి పార్లమెంటులోఒప్పుకొనెను. ఆంగ్లేయ దేశములోని లండను, 'వెస్టుమిని స్టరు, సర్రె, మిడిల్ సెక్సు ప్రాంతములలో ప్రజలు బహిరంగ సభలు జరిపి యమెరికనులతో యుద్దము చాలించుమని తీర్మా నములు చేసి పార్లమెంటుకు బంపిరి.

ఇతర
 ఖండములలో
యుద్ధములు.


" 1782 వ సంవత్సరము జనవరి 31 వ తేదీన డెమరారాను పరాసువారు జయించిరి. పిభ్రవరి ఇతర ఖండములలో నెలలో సెంటు కీట్సు, నెవిసు, మాంట సిరా టులను స్పైన్ వారాశ్రమించిరి. కేపుఆఫ్ గుడ్ హోపును ఆంగ్లేయులు ముట్టడించి, పరాసువారికిని ఆంగ్లేయులకును సముద్రముమీద కొన్ని కలతలు జరిగె. ఎవరు గెలిచినది చెప్పుటకు వీలు లేదు. పరాసు నౌకలమీద మూడు వేల పరాసు సైన్యములు