పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

అమెరికా సంయుక్త రాష్ట్రములు



మాసకరమైనసంధి చేసుకొనుటకు తాను సమ్మతించ జాలనని చెప్పెను. ఫొస్సు, స్పైన్, అమెరికాలతో యుద్ధముచేయుటకు రాజు సన్నద్ధుడయ్యెను.

అన్ని ఖండలలోను
యుద్ధము.


జులై 8వ తేదీన స్పైన్ సైన్యములు బాల్టరునుముట్టడించెను ఫోన్సు వారిని ఇంగ్లాండు పై దాడి వెడలమని స్పైన్ ప్రోత్సహించెను. పరాసు,స్పైన్ దేశముల సౌకాదములు కలిసి ఇంగ్లీషు ఛానలులోనికి వచ్చెను, అటునిటు క్రిందికి పైకిగ్రుమ్మరెను. ప్లిమాతు రేవువద్దకు వచ్చి ఆంగ్లేయ వర్తక పడవలను పట్టుకొనెను. ఒక ఆంగ్ల యుద్ధ నౌకనుకూడ స్వాధీనమపరచుకొనెను. ఇంతకంటే నేమియు చేయలేదు. పరాసు, స్పైన్ నౌకానేనాధిపతుల కభిప్రాయ భేదములు కలిగెను. బంక విరేచనములు సైనికులలో వ్యాపించెను. బెస్టు రేవును మరలి పోయెను. అక్కడనుంచి చీలిపోయెను. పరాసు నేనలలో జ్వరముకూడ ప్రబలెను. ఏమియు చేయకపోయినను వృధాగా విశేషసొమ్ము మాత్రము ఖర్చయ్యెను.


యూరొపు ఖండమున (నారు సీ) ఉత్తర సముదములో రెండు అమెరికను యుద్ధ నౌకలు ఆంగ్లేయ నౌకలను ముట్టడించెను. పోరు తీవ్ర ముగనే జరిగెను, ఆంగ్లేయ నౌకలను అమెరికనులు పట్టు కొని హాలుడు రేవులోనికి చేర్చింరి. ఒక ఆంగ్ల నౌక తగుల బడిపోయెను. ఒక అమెరికను నౌకవిశేషముగ నష్టమొందెను. 'అమెరికా ఖండమున పశ్చిమయిండియా ద్వీపములతో పరాసు వారి రెండు ద్వీపముల నాంగ్లేయులు పట్టుకొనిరి. స్పైన్