పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/168

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

149


లారెన్సు అను నాయనను పంపిరి. మిక్కిలి అవమానకర మగు విషయ మేమన యుద్ధము కొన్ని సముద్రతీర ప్రాంత ములలోను సరిహద్దులనును మాత్రము జనగుచుండగ రాష్ట్ర ములలోని ప్రజలు మామూలుగ ద్రవ్యార్జనము చేసికొనుచుండిరి. వర్జీనియాలోని పొగాకు పంటకు లోపము కలుగ లేదు. మేసషు పెట్సు వారు వర్తకముచేసి ధనవంతులగుట మానలేదు. యుద్ద విరాళముల నిచ్చుటకును ఋణముల నిచ్చుటకును మాత్రమే లోపము కలుగుచున్నది.

ఆంగ్లేయిలు
జార్జియా రాష్ట్రమును
నాక్రమించుట.


వాషింగ్టను సేనావివద్ద తగిన సేనలుగాని ఆయుధములుగాని లేక యుద్ధము తీవ్రముగ సాగించుటకు కశక్తుడుగనుండెను. దక్షిణ ప్రాంత మంతయూ అమెరికను రాజభక్తులచే నిండి యుండెను. ఈ రాజభక్తులు జార్జియా రాష్ట్రము పై రెండు సార్లు దండెత్తి యుండిరి. వీరి పైకి అమెరికను సైన్యములు వెడలెను. ఇంతలో రెండు వేల మంది ఆంగ్ల సేనలు శవన్నావద్ద నీయమెరికనులను ముట్టడించెను. డిశంబరు 29 వ తేదీన జరిగిన యుద్దములో పూర్తిగా సమెరికను లోడిపోయిరి. శవన్నా శత్రువుల వశమయ్యెను. 1779 వ సంవత్సరము జనవరి నెలలో నిచట నుండి ఆంగ్లేయ సేనలు జార్జియా రాష్ట్రము నంతను స్వాధీనమును పొందెను.