పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/166

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

147

ఆంగ్లేయులకును
పరాసులకు
యుద్ధములు.

ఆంగ్లేయులకును పరాసు వాటికిని ప్రపంచములో వివిద ప్రాంతములలో యుద్ధము ప్రారంభమయ్యెను జులై 27 న తేదిన ఉభయుల నౌకాదళములును బ్రెస్టు రేవుకు సమీపమున పోరు సలిపిరి. ఎవరికిని జయము కలుగ లేదు. సెప్టెంబరు నెలలో పశ్చిమయిండియా ద్వీపములలోని ఆంగ్లేయులదగు డొమినికా ద్వీపమును పరాసువారు స్వాధీనపరచుకొనిరి. పరాసువారి "సెంటులూసియా ద్వీపము నాంగ్లేయు లాక్రమించిరి. ఆమెరికా యుద్ధనౌకలు ఇంగ్లాండు, దేశముయొక్క, పశ్చిమతీరమును కొంతవరకు నష్టపరచెను. వైటుహెూవనురేవులో నున్న ఆంగ్లేయ పడవలను తగులబెట్టెను. హిందూదేశములో నప్పటికి పూసువారికి పుదుచ్చేరి, కారైకాలు, యానాం, మాహి, చంద్రనాగూరు పట్టణములుమాత్రమే గలవు. ఆంగ్లే యులకు గొప్ప గొప్ప రాష్ట్రములు స్వాధీనమందుండెను. ఆంగ్లేయ గవర్నరు జనరలు వారన్ హేస్టింగ్సు పరాసువారికి చెందిన పుదుచ్చేరి మొదలగు పట్టణము, సన్నిటిని స్వాధీనమును పొందదలచెను. పుదుచ్చేరి డెబ్బది రోజులవరకు లోబడక ఎదిరించెను. తక్కినవి వెంటనే ఆంగ్లేయుల వశమయ్యేను మాహి పట్టణమును పట్టుకొనినచో "తాను యుద్ధమునకు దిగుదునని మైసూరు ప్రభువు హైదరాలి చెప్పెను. ఆయన మాటలు లక్ష్యము చేయక ఆంగ్లేయులు మాహిని పట్టుకొనిరి. హైదరావాలి ఆంగ్లేయులపై యుద్ధమును ప్రకటించి కర్నాటకము

దాడి వెడలెను.