పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/158

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

139



విశ్వాసము కలిగి ప్రభుత్వములకు ఋణముల నిచ్చిరి. మంచి నాళాదళమును నిర్మించుటకు విశేషముగ ద్రవ్యము వెచ్చించ బడెను. ఈ సమయమున స్పైన్ యొక్క సహాయముతో తిరిగి సముద్రములపైన అధికారము పొందుటకు ప్రాస్సు ఉద్దేశించెను.

ఆంగ్లేయ ప్రభుత్వములు
కొంతవరకు లోబడుట.

ఇంగ్లాండులో నీ సంధిసంగతి తెలియగనే గొప్ప కలవరము జనించెను. రాజు ఆంగ్లేయ సైన్యము లను పూర్తిగ అమెరికానుండి తీసి ఫ్రాన్సు దేశముతో మాత్రము యుద్ధము చేయవలెనని తలచెను. అమెరికా పోయినను సరే, ఫ్రాన్సు దేశము పై పగ తీర్చుకొనవలెనను నూపా ఆయన మనమునందు పొడమెను. గాని ఈ యూహ సనుసరించి ప్రవర్తించలేదు. అమెరికనులకు కొన్ని హక్కుల నిచ్చి రాజీ పర్చుకొనవలె ననుతలంపు పార్లమెంటుసభ్యలకు కలిగెను. ఈ తలంపు ప్రధమము ననే నుఁడినచో యుద్ధమే జరిగియుండెడిది కాదు. ఫిబ్రవరి 17 వ తేదీన అమెరికనులను సంత్సప్తి పపరచు సుద్దేశముతో కొన్ని చట్టములను చేసిరి. అమెరికాకు చట్ట ప్రకారము స్వతంత్ర మివ్వకపోయినను ప్రవర్తనలో స్వతం త్రముగ చేయుచున్నామని ప్రధానమంత్రి నార్తు పభువు చెప్పెను. ఆదినమున ఇంగ్లాండు పార్లమెంటుకు అమెరికనులకు లోబడుస్థితిలో నుండిరి. కానీపరిపూర్ణమగు స్వతంత్రము సంగీకరించుట కష్టము లేకుండెను. కావున ఎటు ప్రవర్తించుటకును తోచక ఏవోయర్ధము లేని కొన్ని చట్టములను చేసిరి. అమెరికా వారిని పరాసువారికిని సంధి జరిగిన సంగతి తెలియలేదా..