పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/150

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

131


బడెను గాని అమెరికనులే విశేషసషముతో నోడిపోయి పలాయనమైరి. నాలుగు దినముల తరువాత న్యూయార్కులోని ఆంగ్లేయ సైన్యములు హడ్సను నదిమీదనున్న మాంగమరీ క్లింటన్ కోటలను పట్టుకొనుటయేగాక 'రెండు అమెరికను యుద్ధ 'నౌకలనుకూడ నాశనముచేసిరి. వాషింగ్టను తన సైన్యములతో డెలవేరు కోటలోనుండెను. ఆంగ్లేయులు వచ్చి ముట్టడించిన, 'అయిదుదినములు వాషింగ్టను తీవ్రముగ పోరునలిపెను. కాని ఆంగ్లేయ సేనలసంఖ్య వారికి జమును కలుగచేసెనను" నవంబకు 20 వ తేదీన వాషింగ్టను దెలవేరు కోట నాంగ్లేయులు పశముచేసి వెడలిపోయెను. వాషింగ్టను తన సేనలతో లైటు మార్డును చేరెను. అక్కడనుండి ఆంగ్లేయ సేనాని హూ వాషింగ్టనును తరుమగ వాలీఫోర్టీ లో వాషింగ్టము ప్రవేశంచెను. వాషింగ్టసు సమర్దుడుకాడని యనేక మంది అమెరికనుల కపోహలు కలుగసాగెను.


సెరటోగా మిట్టల
వద్ద అమెరికనులు గొప్ప
జయమునొందుట

కాని మరియొక ప్రాంతమువ భగవదనుగ్రహమువలనఅమెరికనుల నావరించిన యుధకారము విడి పోయి ఆశాసూర్యుడు తన కిరణములను వద్ద ప్రకాశింప జేయుచున్నాడు, ఆంగ్ల సేనాపతి బర్గాయిను హడ్సను నదిని దాటి "సెరటోగామిట్ట పదేశమును చేరి అక్కడ నుంచి హడ్సను నది యొద్దుననే పోయి 'బెసుసుకొండలవద్దనున్న అమెరికను సైన్యం ములను తాకెను. ఆదినమంతయు ఆంగ్లేయులకును అమెరికను లకును జరిగిన పోరాటములో ఆంగ్లేయులే వెళ్కువ నష్టమును పొందిరి. అమెరికను నేనలు సుక్షితముగా తమవిడిది చేరి